Homeజాతీయ వార్తలుTwo Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్ నినో ఎఫెక్ట్: ఇద్దరు మగాళ్లు పెళ్లిచేసుకున్నారు..!

Two Men Marriage: ఎల్‌నినో ప్రభావం భారతదేశంపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావంతో అన్నదాతలు అల్లాడుతున్నారు. అయితే వానదేవుడని ప్రసన్నం చేసుకునేందుకు ఒడిశాలో ఓ గ్రామస్థులు శతాబ్దాల నాటి ఒక వినూత్నఆచారాన్ని పునరుద్ధరించారు. కాల్వలు, చెరువులు ఎండిపోయి, పంటలు పండక అల్లాడుతున్న తరుణంలో, ప్రకృతిని శాంతింపజేయడానికి ఈ విచిత్ర సంప్రదాయాన్ని గ్రామస్థులు ఆశ్రయించారు. ఇంతకీ వీరు ఏం చేశారంటే?

ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లాకు చెందిన ఒక గ్రామంలో వర్షాలు పడాలని కోరుకుంటూ ఇద్దరు పురుషులకు ఘనంగా వివాహం జరిపించారు. ఈ ఆచారాన్ని స్థానికంగా ‘అందిర బిబాహ’ (మగ పెళ్లి) అని పిలుస్తారు. వర్షాలు పడకుండా తీవ్రమైన కరవు పరిస్థితులు ఏర్పడినప్పుడు, వరుణ దేవుడి అనుగ్రహం కోసం ఈ తరహా మగ పెళ్లిళ్లు చేయడం అక్కడ శతాబ్దాలుగా వస్తున్న నమ్మకం. ఈ వివాహం ద్వారా ప్రకృతికి, దైవానికి మధ్య ఉన్న బంధం బలపడి, త్వరలోనే మేఘాలు కురుస్తాయని స్థానికులు బలంగా నమ్ముతారు.

ఈ వినూత్న వివాహ వేడుకలో గ్రామానికి చెందిన 29 ఏళ్ల జతిన్ వరుడిగా మారగా, 27 ఏళ్ల కలాండి వధువు రూపం ధరించారు. కేవలం ఏదో మొక్కుబడిగా కాకుండా, ఈ పెళ్లిని ఒక సాధారణ సాంప్రదాయ వివాహం లాగే అత్యంత వైభవంగా నిర్వహించారు. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు అలంకరణలు, మంగళ వాయిద్యాలు, బంధుమిత్రుల కోలాహలం, పెళ్లి విందు.. ఇలా అన్ని కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. గ్రామంలోని పెద్దలు, మహిళలు ఈ వేడుకలో ఉత్సాహంగా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

అయితే, ఈ పెళ్లి వెనుక ఉన్న అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఎంతో వైభవంగా ఒక్కటైన ఈ మగ జంట ఎక్కువ కాలం కలిసి ఉండదు. కేవలం వాన దేవుడిని ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా జరిగే ఈ పెళ్లి ముగిసిన మరుసటి రోజే ఈ జంట అధికారికంగా విడిపోతుంది. ఆ తర్వాత ఎవరి జీవితాన్ని వారు యథావిధిగా గడుపుతారు. ఆధునిక కాలంలో ఇలాంటి నమ్మకాలు ఆశ్చర్యం కలిగించినప్పటికీ, కరవు కోరల్లో చిక్కుకున్న తమ భూములను, జీవనోపాధిని కాపాడుకోవడానికి గ్రామస్థులు తమ పూర్వీకుల నాటి నమ్మకాన్నే నమ్ముకుని ఈ వివాహాన్ని నిర్వహించారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version