BBC India
BBC India: ఫర్ సప్పోజ్ మన దేశంలో ఉన్న రిపబ్లిక్ టీవీ (republic TV) ఇంగ్లాండ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోంది అనుకుందాం. దానికి ఉన్న సోర్స్ దృష్ట్యా ఇంగ్లాండ్ భారతదేశం మీద పడి పందికొక్కులా తిన్నదని.. లండన్ నగరాన్ని భారతీయుల సంపదను దోచి కట్టింది అని.. ఒక డాక్యుమెంటరీ తీస్తే.. బ్రిటిష్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? పోనీ ప్రస్తుత బ్రిటిష్ ప్రధానమంత్రి నరరూప రాక్షసుడు.. రక్తం రుచికి మరిగినవాడు.. అంటూ ఒక కథనాన్ని ప్రసారం చేస్తే బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ప్రతిస్పందిస్తుంది..
బ్రిటిష్ లో ఉండుకుంటూ.. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. బ్రిటిష్ ప్రధానమంత్రి కి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తే ఎలా ఊరుకుంటుంది అనే కదా మీ సమాధానం.. ఇప్పుడు ఇలాంటి పరిస్థితే బ్రిటిష్ మీడియా సంస్థ BBC కి ఇండియాలో ఎదురయింది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ఆ మధ్య బిబిసి ఒక డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అది కాస్త ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా ఉంది. పైగా ఓ వర్గాన్ని ఆయన కావాలని తొక్కి పెట్టారని.. చేయకూడని విధంగా పనులు చేశారని.. అందువల్లే ఆ వర్గం నాటి రోజుల్లో తీవ్ర ఇబ్బంది పడిందని.. బిబిసి తన డాక్యుమెంటరీ లో వెల్లడించింది. ఇది కాస్త ఎన్నికలకు ముందు బీబీసీ ప్రచారం చేయడంతో.. దాని అసలు లక్ష్యాలు ఏమిటో బయటి ప్రపంచానికి తెలిసింది. దీంతో ఆ డాక్యుమెంటరీ పూర్తిస్థాయిలో విడుదల కాకముందే ప్రధానమంత్రి కార్యాలయం అప్రమత్తమైంది. వెంటనే బిబిసి కి లేఖ రాసింది. అంతేకాదు దానిని ప్రసారం చేయకూడదని యూట్యూబ్ కు విన్నవించింది. అందులో ఉన్న నిరాధారమైన విషయాలను బిబిసి యాజమాన్యానికి.. యూట్యూబ్ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్ళింది. ఆ తర్వాత ఆ డాక్యుమెంటరీ మనదేశంలో విడుదల కాలేదు..
బి బి సి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా డాక్యుమెంటరీని రూపొందించడంతో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంట్రీ ఇచ్చాయి. ముఖ్యంగా ఈ డి బి బి సి ఇండియా కార్యాలయంలో దాడులు నిర్వహించింది. అయితే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలకు విరుద్ధంగా బీబీసీ ప్రవర్తించిందని.. 2023 లో ఆ సమస్యకు ఈడి షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే దీనిపై బీబీసీ కూడా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సుదీర్ఘ విచారణ తర్వాత.. బిబిసి సంస్థతోపాటు.. ముగ్గురు డైరెక్టర్లకు 1.14 కోట్ల చొప్పున ఫైన్ విధించింది ఈడి.. భారత్లో డిజిటల్ మీడియాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 26 శాతానికి మించకూడదు. అయితే దీనిని అతిక్రమించి బిబిసి పెట్టుబడులను స్వీకరించింది. పైగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేయడం మొదలు పెట్టింది. గోరంతలను కొండంతలు చేయడం ప్రారంభించింది. అందువల్లే ఆ సంస్థ పై ఈడి దాడులు చేసింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి నిబంధనలను బీబీసీ అతిక్రమించిందని గుర్తించింది. చివరికి ఇన్నాళ్లకు బీబీసీపై 1.14 కోట్ల ఫైన్ విధించింది. అయితే దీనిపై బీబీసీ ఇండియా ఇంతవరకు స్పందించలేదు. దీనిపై కౌంటర్ పిటిషన్ దాఖలు చేస్తుందా? లేక ఈడి విధించిన ఫైన్ చెల్లిస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. ఒకవేళ ఇది చెప్పినట్టుగా ఫైన్ చెల్లిస్తే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను అతిక్రమించినట్లు బిబిసి ఒప్పుకున్నట్టు అవుతుంది. మరి దీనిపై బీబీసీ ఇండియా ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది.