AP Government: ఆంధ్రప్రదేశ్ లో రోజువారీ కేసుల విచారణ మొదలైంది. గతంలోనే కేసుల విచారణలో వేగవంతం చూపాలని హైకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఆ దిశగా ముందడుగు పడింది. ఇందులో భాగంగానే ఉన్నత న్యాయస్థానం సీజే నేతృత్వంలో త్రిసభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించింది. ప్రభుత్వంపై వచ్చిన పిటిషన్లను తక్షణమే పరిష్కరించేందుకు కోర్టు నిర్ణయించిన నేపథ్యంలోనే కేసుల్లో పురోగతి కనిపిస్తుందని ఆశిస్తున్నారు.

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం దృష్టి సారించింది. వాటి పరిష్కారానికి వాదనలు వినిపించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను కోర్టు పట్టించుకోలేదు. రైతుల తరఫు న్యాయవాది శ్యామ్ దివాస్ వాదనలు వినిపించారు. రైతు సమస్యలు పట్టించుకోవాలని కోరారు. దీనిపై కోర్టు ఇంకా ఏ నిర్ణయం కూడా తీసుకోలేదు.
Also Read: జగన్ మెడకు చుట్టుకోనున్న రెండు సమస్యలు?
ఈ నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై ఇదివరకే పలు విషయాల్లో కేసులు నమోదు అయ్యాయి. అక్రమ ఆస్తుల కేసు నుంచి ఇప్పటి వరకు చాలా కేసులు పెండింగులో ఉన్నందున ప్రభుత్వంపై ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించే క్రమంలో కోర్టు చేసిన సిఫారసుతోనే కేసుల విచారణలో పురోగతి కనిపిస్తోంది. దీని కోసం ప్రభుత్వంపై ఉన్న కేసులను తగ్గించాలనే ఉద్దేశంతోనే సాధ్యమైనంత వరకు తొందరగా పరిష్కరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Also Read: హైకోర్టులో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీకి ఊరట
ఈ క్రమంలో మూడు రాజధానుల కేసు కూడా విచారణకు రానున్నట్లు సమాచారం. రాష్ర్టంలో అభివృద్ధి పనులు ఏం జరగడం లేదని కూడా కొన్ని కేసులు వచ్చినట్లు చెబుతున్నారు. దీంతో కేసుల విచారణలో వేగవంతం చూపించి త్వరగా పరిష్కరించేందుకు కోర్టు చొరవ చూపించడం గమనార్హం. రాష్ర్టంలో అభివృద్ధి పనుల జాడే కనిపించడం లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కానీ సర్కారు మాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.