Pawan Kalyan Books: ఒక ఇంటర్మీడియెట్ ఫెయిల్ అయిన వ్యక్తి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి ఆరాధ్యుడిగా.. నడిపించే నాయకుడిగా ఎదగడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ భారీ మార్పునకు కారణం ఆయన ఎదుర్కొన్న కష్టాలు అనుభవాలే. ఎంతో సిగ్గరి.. నలుగురితో మాట్లాడడానికి కూడా భయపడే పవన్ ఇప్పుడు లక్షల మంది జనం ముందు రొమ్మువిడిచి ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే దానికి ఒకే ఒక కారణం ఉంది.

పవన్ కళ్యాణ్ లో ఈ మార్పునకు కారణం ‘పుస్తకాలు ’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన ఇంటర్ ఫెయిల్ అయిన తర్వాత అన్నయ్య చిరంజీవి ఇంట్లో ఉన్నప్పుడు డిప్రెషన్ , ఒంటరితనంతో బాధపడ్డాడు. ఆ సమయంలో అన్నయ్య చిరంజీవి, వదిన సురేఖ ధైర్యం చెప్పాడు. అప్పుడే పుస్తకాలతో పవన్ కు పరిచయం ఆయనను గొప్ప పరిణతిగల వ్యక్తిగా తీర్చిదిద్దిందట..
పవన్ కళ్యాణ్ ఖాళీ టైంలో హైదరాబాద్ శివారున ఉన్న తన ఫాంహౌస్ కు వెళ్లి ఆ తోటలో కుర్చీ వేసుకొని ‘పుస్తకాలు’ చదువుతుంటాడు. అదే ఆయన హామీ. ఖాళీ టైం దొరికితే చాలు స్ఫూర్తి నిచ్చే వ్యక్తుల చరిత్రలు, పౌరుషాల కథలు.. చేగువేరా వీరత్వాలు.. తెలుగు రచయితల విప్లవ సాహిత్యాలు చదువుతుంటారట..

పవన్ కళ్యాణ్ కు ఇంటర్ ఫెయిల్ అయ్యాక స్ఫూర్తి కోసం చదివిన ఆ పుస్తకాలు ఇప్పుడు ఆయనకు తోడుగా నిలిచి పరిపూర్ణ మనిషిగా తీర్చదిద్దడంలో సహాయపడ్డాయి. పవన్ ను మనముందు ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దడంలో ఆయన చదివిన పుస్తకాలే ముఖ్య కారణమని సన్నిహితులు చెబుతుంటారు.