Brahmastra Pre Release Event Cancelled: ఎవరి పగ, ప్రతీకారాలో ఇంకెవరికో శాపంగా మారాయి. హిందీ ప్యాన్ ఇండియా హైబడ్జెట్ చిత్రం ‘బ్రహ్మస్త్ర’ తెలంగాణ రాజకీయ ఉచ్చులో బలైపోయింది. ముందుగా కమిషనర్ ఈ బ్రహ్మస్త్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతులు ఇచ్చి.. ఆ తర్వాత ఒకరోజు ముందు రద్దు చేశారని వార్తలు బయటకు వచ్చాయి. దీంతో చేసేందేం లేక చిత్రం యూనిట్ కోట్లు మునిగిపోయి బోరుమన్నదట.. ఇప్పుడిదే ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

రామోజీ ఫిలిం సిటీలో ‘బ్రహ్మస్ర్త ’ ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం నిర్మాతలు దాదాపు రూ.2.25 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఫిలిం సిటీ అద్దె, ఏర్పాట్లు, అభిమానుల కోసం.. సెలబ్రెటీల ఖర్చులన్నీ కలిపి ఇంత వ్యయం అయ్యాయి. పోనీలే బజ్ వస్తే అదే చాలు అనుకున్నారు.కానీ కట్ చేస్తే..
చివరి నిమిషంలో పోలీసులు ‘బ్రహ్మస్త్ర ’ ప్రీరీలిజ్ కు పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ నిర్మాతలు నిండా మునిగారు. వ్రతం చెడ్డా ఫలితం దక్కనట్లు అయిపోయింది.దీంతో ఆవేదన చెందిన నిర్మాతలు వచ్చిన సెలబ్రెటీలతో అప్పటికప్పుడు హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ ను బుక్ చేశారు.

అప్పటికప్పుడు రూ.10 లక్షల ఖర్చుతో పార్క్ హయత్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమా ప్రీరిలీజ్ మాట్లాడాల్సింది ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ సహా ఇతర సినీ ప్రముఖులు రాజమౌళి, నాగార్జునలతో మాట్లాడించారు. అలా సినిమా ప్రీరిలీజ్ ద్వారానే నిర్మాతలు రూ.2.25 కోట్లు మునిగారన్న వార్త కలకలం రేపుతోంది. తెలంగాణ ప్రభుత్వం , పోలీసులు చేసిన పనికి ఇప్పుడు ‘బ్రహ్మస్త్ర ’ నిర్మాతలు తలపట్టుకుంటున్నారట..
ఇక రామోజీరావు, జూనియర్ ఎన్టీఆర్ లతో ఇటీవల కేంద్రహోంమంత్రి అమిత్ షా భేటి అయ్యి సాన్నిహిత్యంగా గడిపారు. ఆశ్చర్యకరంగా వీరిద్దరి ప్రమేయం ఉన్న ‘బ్రహ్మస్త్ర’కు తెలంగాణ సర్కార్ అనుమతి ఇవ్వకపోవడంతో ఇది రాజకీయ దుమారం రేపుతోంది.
[…] Also Read: Brahmastra Pre Release Event Cancelled: రామోజీ ఫిలిం సిటీలో ‘బ… […]