Political Strategists: వ్యూహకర్తలు నిజంగా గెలిపిస్తారా.. ఆ సత్తా వారికి ఉందా..?

కేవలం ఒక అంశాన్ని చూసి మాత్రమే ప్రజలు ఓటు వేయరు. ఎవరి అభిప్రాయం వాళ్లకుంటుంది. కొందరు అభివృద్ధిని చూస్తున్నారు.

Written By: Raj Shekar, Updated On : December 28, 2023 5:28 pm

Political Strategists

Follow us on

Political Strategists: రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహకర్తల కాలం నడుస్తోంది. తెలుగు రాష్ట్రాలో వీరి ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. వందేళ్ల పార్టీ నుంచి నిన్న మొన్న పుట్టిన పార్టీ వరకు అందరూఏ స్ట్రాటసిజ్టులను నియంమించుకుంటున్నారు. ఒక స్ట్రాటజిస్టును పెంచుకుంటే అన్నీ ఆయనే చూసుకుంటాడు.. పార్టీని ఎన్నికల్లో గెలిపిస్తాడన్న భావనలో పార్టీలు ఉన్నాయి. అయితే వ్యూహకర్తల ప్రభావం పార్టీలు, ప్రజలపై ఎంత ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నాకంటే పెద్ద వ్యూహకర్త ఎవరు అన్నట్లు వ్యవహరించారు గులాబీ బాస్‌ కేసీఆర్, ఇక కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా సునీల్‌ కనుగోలు వ్యవహించారు. ఎన్నికల్లో ఫలితాలు వ్యూహకర్తవైపే మొగ్గు చూపాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకతే కాంగ్రెస్‌ను గట్టెక్కించింది. ఇక, తాజాగా ఏపీలోనూ వ్యూహకర్తల రాజకీయం మొదలైంది. ప్రశాంత్‌ కిశోర్‌ చంద్రబాబుతో భేటి కావడం సరికొత్త చర్చకు దారి తీసింది. అంతా వ్యూహకర్తలే చూసుకుంటే మరి ప్రజలకు, ప్రజాభిప్రాయానికి విలువ ఎక్కడ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ప్రజాభిప్రాయానికి విలువ లేదా…
పార్టీలు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే.. ప్రజల అభిప్రాయానికి అవి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని తెలుస్తోంది. వ్యూహకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ప్రశాంత్‌ కిషోర్, రాబి¯Œ శర్మ, సునీల్‌ కనుగోలు, రిషి రాజ్‌ సింగ్‌.. ఇలా రకరకాల పేర్లతో ఉన్నవారిని నియమించుకుంటున్నారు. ఒక స్ట్రాటజిస్టును నియమించుకుంటే అన్నీ వారే చూసుకుంటారు అన్న భావన పార్టీల్లో వ్యక్తమవుతోంది.

ఓటర్లపై అనేక అంశాల ప్రభావం..
కేవలం ఒక అంశాన్ని చూసి మాత్రమే ప్రజలు ఓటు వేయరు. ఎవరి అభిప్రాయం వాళ్లకుంటుంది. కొందరు అభివృద్ధిని చూస్తున్నారు. ఇంకొందరు నాయకుడి వ్యవహారశైలిని చూస్తున్నారు. మరికొందరు తమకు అందుతున్న సంక్షేమ పథకాలను గుర్తు పెట్టుకుంటారు. ఇంకా పాలనలో అవినీతిని వ్యతిరేకిస్తూ ఓటేసేవాళ్లూ ఉంటారు. ప్రజలు ఎవరికైనా ఓటు వేయాలంటే.. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలతోపాటు సామాజిక అంశాలు, అభ్యర్థి వ్యక్తిత్వం, స్థానికత అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. చివరకు తమకు నచ్చిన వారిని ఎన్నుకుంటారు.

వ్యూహకర్తల పనేంటి..
పార్టీలకు వ్యూహకర్తలు చేసేది ఏంటంటే.. శాస్త్రీయ దృక్పథంతో ప్రచారం చేయడం, విభిన్నంగా పార్టీ ప్రచార శైలిని జనంలోకి తీసుకెళ్లడం, ప్రజల నాడిని గుర్తించడం, అందుకు అనుగుణంగా పార్టీల మేనిఫెస్టోలు, హామీలు తయారు చేస్తారు. గెలుపు దిశగా వెళ్తున్న పార్టీని ఒక శాతం మెరుగుపడేటట్టు కూడా చేయగలుగుతారు. అంతే తప్ప పార్టీల విజయావకాశాలను తారుమారు చేయలేరు. ప్రజల అభిప్రాయాన్ని.. తమ స్ట్రాటజీలతో ఒక్కసారిగా మార్చేయలేరు.

నాడు సొంతంగా రాజకీయాలు..
మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, మాజీ ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు, జయలలిత, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్, జ్యోతిబసు లాంటి నేతలు.. ఏ వ్యూహకర్తలపై ఆధారపడి రాజకీయం చేయలేదు. సొంతంగా ఎన్నికల్లో గెలిచారు. నాటి నేతలకు పార్టీతోపాటు రాజకీయ భౌగోళిక స్వరూపంపై పూర్తిగా పట్టు ఉండేది. ఏ జిల్లాలో ప్రజలు ఎలా ఉంటారు? అక్కడ సామాజిక అంశాలు ఏంటి? స్థానిక అంశాలు ఏంటి? దేనికి ఎలాంటి పరిష్కారం చూపించాలి? అన్న అంశాలపై ఒకప్పుడు లీడర్లు తెలుసుకునేవారు. ఇప్పటి నాయకులు రెండు నెలల ముందు పార్టీ టికెట్లు తీసుకుని.. ఆదరా బాదరాగా ప్రచారం చేసి గెలిచి.. ఆ తరువాత ఐదేళ్లు కాంట్రాక్టులు, వ్యాపారాలు చేసుకునే ప్లాన్‌లో ఉంటున్నారు. దీంతో ప్రజల సమస్యలు, ప్రజల ఆకాంక్షలు వారికి తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే వ్యూహకర్తల అవసరం పార్టీలకు ఏర్పడుతుంది. వారిపై ఆధారపడి ఇన్‌స్టంట్‌గా ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అయితే ప్రజలకు ఒక పార్టీని గెలిపించాలి. ప్రజలు ఓ పార్టీని ఓడించాలని నిర్ణయంచుకునన తర్వాత.. ప్రజల అభిప్రాయాన్ని వ్యూహకర్తలు మార్చగలుగుతారా అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. అయితే వ్యూహాలు అమలు చేసే వ్యక్తిని బట్టి కొంత ప్రభావం చూపొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీకే లాంటి స్ట్రాటజిస్టులు కులాలను ఎలా చీల్చాలి.. వాటి నుంచ ఓట్లు ఎలా పొందాలని అని చూస్తాడు. జనానికి ఎంత డబ్బులు ఇవ్వాలో కూడా డిసైడ్‌ చేస్తాడు. మరో వ్యూహకర్త అయితే అవయవాలకు ఫ్యాక్చర్‌ అయినట్లు.. కోడి కత్తి లాంటి దాడి కేసు, పరస్పర దాడులు ప్లాన్‌ చేస్తారు.

వాస్తవాలు చెప్పకుండా..
ఎన్నికల్లో పార్టీలు వాస్తవాలను ప్రజల ముందు పెట్టే రోజులు పోయాయి. ఇన్‌స్టంట్‌ హామీలతో గద్దెనెక్కడమే లక్ష్యంగా నేతలు, పార్టీలు రాజకీయాలు చేస్తున్నారు. ఇక వ్యూహకర్తలు పక్కవాడిని ఎలా డామేజ్‌ చేయాలి అనే ఒకే ఒక ఫార్ములా మీద పని చేస్తున్నారు. ఇక చాలా బాధాకరమైన విషయం ఏంటంటే దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్న నేతలు, ప్రజాజీవితంలో ఏళ్లుగా మమేకమై ఉన్నవారు, రాష్ట్రాల పొలిటికల్‌ జాగ్రఫీ తెలిసిన నేతలు కూడా వ్యూహకర్తల వెంట పడడం, వారి కాళ్లు పట్టుకోవడం. మీరే గెలిపించాలి అంటూ ప్రాధేయపడటం. ప్రజాస్వామ్య ప్రక్రియలో, ఎన్నికల రణరంగంలో ప్రజాభిప్రాయాన్ని మించింది లేదు. ఓటరు తాను అనుకున్నది అమలు చేస్తాడు. దానికి తిరుగు ఉండదు. ప్రజాభిప్రాయాన్ని నూటికి నూరు శాతం వ్యూహకర్తలు ఎప్పటికీ మార్చలేరు. వాళ్లు చేయగలిగేది విస్తృతమైన, విభిన్నమైన ప్రచారంతో ఒక్క శాతం తేడా మాత్రమే చూపించగలుగుతారు.