Plastic: ప్లాస్టిక్.. ఇది మన నిత్య జీవితంలో భాగమైంది. ప్లాస్టిక్ వినియోగించకుండా రోజు గడవడం లేదంటే అతిశయోక్తి కాదు. ఇంతలా మన జీవితంతో పెనవేసుకున్న ప్లాస్టిక్ డేంజర్ అని 90 శాతం మందికి తెలుసు అయినా.. వినియోగించకుండా ఉండలేని పరిస్థితి. మనం వినియోగించకపోయినా.. మనం కొనే పదార్థాలు కూడా ప్లాస్టిక్ ప్యాకింగ్‌లోనే వస్తున్నాయి. దీంతో మనకు తెలియకుండానే వినియోగిస్తున్నాం. అయితే వీటిలో మన ఆరోగ్యానికి హాని కలిగించే కొన్ని డేంజరస్ ప్లాస్టిక్‌లు కూడా ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.
ఈ త్రీ యారోస్‌ను గమనించండి..
ప్రతీ ప్లాస్టిక్‌పై త్రీ యారోస్ ట్రై యాంగిల్ తరహాలో ఉంటాయి. దీనిని లూప్ అంటారు. ఇందలో కొన్ని నంబర్లు ఉంటాయి. ఈ నంబర్లలో 3, 6, 7 ఉంటే ఇలాంటి ప్లాస్టిక్‌ను పూర్తిగా అవైడ్ చేయాలి. ప్రధానంగా ఈ మూడు నంబర్లు ఉంటే.. అందులో చాలా వరకు ప్రమాదకరమైన రసాయనాలు ఉన్నట్లు. అదేవిధంగా అది భూమిలో కరిగిపోయే కాలం ఎక్కువగా ఉంటుంది. వివిధ రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది.
ఈ నంబర్లు ఉంటే..
ఇక ప్లాస్టిక్‌పై లూప్‌లో 2, 4, 5 నంబర్లు ఉంటే.. అవి మన ఆరోగ్యానికి సేఫ్ అని గుర్తించాలి. వాటితో ప్రమాదం చాలా తక్కువ. ఈ కోడ్ నంబర్లు ఉపయోగించడానికి సేఫ్ అని అర్థం. అయితే ఇలాంటి ప్లాస్టిక్‌ను కూడా వేడి చేయకూడాదు.
ఇక నంబర్ 1 ఉంటే..
ఇక లూప్‌లో నంబర్ 1 ఉంటే దానిని నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. కానీ వీటిని సూర్యరశ్మిలో ఉంచకూడదు. అలా ఉంచితే ప్లాస్టిక్ కరిగిపోయి అందులోని పదార్థాల్లో కలిసిపోతుంది.
అర్థమైంది కదా మీరు వాడే ప్లాస్టిక్ వస్తువుల లూప్‌లో ఏ నంబర్ ఉందో గుర్తించండి. డేంజర్ నంబర్లు ఉంటే వాటిని వెంటనే బయట పడేయండి. వీలైతే ప్లాస్టిక్‌ను దూరంగా పెట్టడం ఇంకా మంచిది.
View this post on Instagram