11 నుంచి భూముల డిజిటల్ సర్వే

తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ర్టంలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ర్టవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని ఇందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేశారు. మిగతా 24 గ్రామాలను రాష్ర్టంలోని 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్నిచర్చించేందుకు ప్రగతిభవన్ లో సీఎం డిజిటల్ ఏజెన్సీల ప్రతినిధులతో […]

Written By: Srinivas, Updated On : June 3, 2021 7:21 pm
Follow us on

తెలంగాణలోని ప్రతి ఇంచు భూమిని డిజిటలైజేషన్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాష్ర్టంలో వ్యవసాయ భూములకు డిజిటల్ సర్వే నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాష్ర్టవ్యాప్తంగా 27 గ్రామాలను ఎంపిక చేయాలని ఇందులో 3 గ్రామాలను గజ్వేల్ నియోజకవర్గం నుంచి ఎంపిక చేశారు. మిగతా 24 గ్రామాలను రాష్ర్టంలోని 24 జిల్లాల నుంచి ఎంపిక చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. డిజిటల్ సర్వే నిర్వహణ అంశాన్నిచర్చించేందుకు ప్రగతిభవన్ లో సీఎం డిజిటల్ ఏజెన్సీల ప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాష్ర్టంలోని పేదల భూమి హక్కుల రక్షణకోసం ధరణి పోర్టల్ ను అమలులోకి తెచ్చింది. భూ తగాదాలు లేని తెలంగాణ నిర్మించడమే లక్ష్యంగా ప్రభుత్వం డిజిటల్ సర్వే చేయిస్తోంది. వ్యవసాయ భూములను డిజిటల్ సర్వే చేసి వాటికి అక్షాంశ రేఖాంశాలు గుర్తించి తద్వారా పట్టాదారుల భూములకు శాశ్వత ప్రాతిపదిక రక్షణ చర్యలు తీసుకోవాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రజల భూమి హక్కులను కాపాడుకోవాలనే నిర్ణయంలో భాగంగా చేపట్టిన డిజిటల్ సర్వేసమర్థవంతంగానిర్వహించాలని ఏజెన్సీలకు సీఎం సూచించారు.

పైలెట్ సర్వేలో భాగంగా ముందుగా తగాదాలు లేని గ్రామాల్లో సర్వే నిర్వహించాలని తర్వాత అటవీ భూములు ప్రభుత్వ భూములు కలిసి ఉన్న గ్రామాల్లో, అంటే సమస్యలు లేని, సమస్యలున్న గ్రామాల్లో మిశ్రమంగా సర్వే నిర్వహించి క్షేత్రస్థాయిలో అనుభవాన్ని గ్రహించాలన్నారు. పూర్తి స్థాయి సర్వేకు విధివిధానాలు ఖరారు చేయాలని సీఎం సూచించారు.

గ్రామాల్లో తగాదాలు లేని విదంగా ఇప్పటికే ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ భూ వ్యవహారాలు చక్కబడిన నేపథ్యంలో డిజిటల్ సర్వే నూటికి నూరు శాతం విజయవంతం అవుతుందని సీఎం స్పష్టం చేశారు. డిజిటల్ సర్వే నిర్వహించే విధి విధానాల గురించి సీఎం కేసీఆర్ సర్వే ఏజెన్సీ ప్రతినిధులతో చర్చించారు. తేడాలు రాకుండా అత్యాధునిక సాంకేతికతను వినియోగించి సర్వే చేపట్టాలని సూచించారు.

గ్రామాల్లో సంప్రదాయంగా కొనసాగుతూ వస్తున్న భూ సర్వే విధానంలో అవలంభిస్తున్న టిపస్ నక్షా విధానాన్ని ప్రాతిపదికగా చేసుకుని సర్వే నిర్వహించాలన్నారు. గ్రామ ప్రజలతో గ్రామసభలు నిర్వహించి వారికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించి సర్వే చేపట్టాలని పేర్కొన్నారు.