Kaushik Reddy: హుజురాబాద్ ఉప ఎన్నికలో కౌశిక్ రెడ్డి వ్యవహారమే కొంప ముంచిందా? అనే అనుమానాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. ఎన్ని కుట్రలు చేసినా ఓటరు మాత్రం ఈటల రాజేందర్ ను గెలిపించడం తెలిసిందే. దీంతో కేసీఆర్ వ్యూహాలు బెడిసికొట్టాయా? అవుననే సమాధానాలు వస్తున్నాయి. గెల్లు శ్రీనివాస్ ఓటమికి సవాలక్ష కారణాలు బయటకు వస్తున్నాయి. తాజా పరిణామాల నేపథ్యంలో అధికార పార్టీ ఓటమికి గల కారణాలపై పోస్టుమార్టమ్ నిర్వహిస్తోంది.
హుజురాబాద్ ఉప ఎన్నికలో అధికార పార్టీ ఓటమికి పలు కారణాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేత కౌశిక్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడమే కొంప ముంచిందనే వాదనలు వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో కౌశిక్ రెడ్డి రెండో స్థానంలో నిలవడంతో ఆయనను పార్టీలో చేర్చుకుంటే ప్లస్ అవుతుందని కేసీఆర్ తొలుత భావించినా మైనసే కావడం గమనార్హం.
తొలుత హుజురాబాద్ బరిలో కౌశిక్ రెడ్డినే నిలబెట్టాలని భావించినా చివరి క్షణంలో మనసు మార్చుకుని గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మొగ్గు చూపడం తెలిసిందే. కానీ ఫలితాల ప్రకటనలో బొక్కబోర్లా పడింది. కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కు మేలు కంటే కీడే ఎక్కువగా చేసినట్లు తెలుస్తోంది. దీంతో కౌశిక్ రెడ్డి రాకతో పార్టీ భవితవ్యం మారుతుందని భావించినా అదృష్టం బెడిసికొట్టింది.
Also Read: Harish Rao: హరీష్ రావుకు ఈటల వదిలేసిన వైద్యఆరోగ్యశాఖ.. రివార్డా? శిక్షనా?
అయితే కౌశిక్ రెడ్డిని పార్టీలోకి తీసుకోకుంటే పరిస్థితి మరోలా ఉండేదని తెలుస్తోంది. కేసీఆర్ చర్యలతో అధికార పార్టీ ఇరకాటంలో పడింది. ఈటల రాజేందర్ విజయానికి బాటలు వేసినట్లు అయింది. సెంటిమెంట్ ముందు మద్యం, డబ్బు ప్రభావం కొంపముంచిందని తెలుస్తోంది. దీంతో భవిష్యత్ లో కూడా టీఆర్ఎస్ కు కష్టాలు తప్పవని పార్టీ నేతలు చెబుతున్నారు.
Also Read: KCR Politics: ఫస్ట్రేషన్ కేసీఆర్.. డైవర్షన్ పాలిటిక్స్..!