గజిబిజిగా లెక్కలు
దేశమంతా కరోనా పెరుగుతుంటే రాష్ర్టంలో మాత్రం కరోనా ప్రభావాన్ని తక్కువ చేసి చూపిస్తున్నారు. గత మూడు రోజులుగా కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు ప్రభుత్వ లెక్కలు సూచిస్తున్నాయి. అసలు కేసుల సంఖ్య తగ్గుతుంది? లేక తగ్గిస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దీంతో కరోనా వైరస్ ఎదుర్కొనే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కరనా ధాటికి కుప్పకూలనున్న ఆర్థిక వ్యవస్థను చూసి భయభ్రాంతులకు గుురవుతున్నారు.
మేకపోతు గాంభీర్యం
తెలంగాణ సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం లాక్ డౌన్ ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన తరువాత ప్రస్తుతం లాక్ డౌన్ విధించే సూచనలున్నాయని వార్తలు రావడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదు. ఒక వైపు కేసుల సంఖ్య తగ్గుతున్నా లాక్ డౌన్ చేయాల్సిన అవసరమేమిటో తేలడం లేదు. దీంతో ప్రభుత్వం చూపిస్తున్న లెక్కలు అబద్ధాలేనా? రాష్ర్టంలో కేసుల సంఖ్య తగ్గడం లేదు. ప్రభుత్వం చూపిస్తున్న లెక్కకలన్నీ దొంగలెక్కలేనా అనే ఆలోచనలు పెరుగుతున్నాయి.
అసలేం జరుగుతోంది?
రాష్ర్టంలో పరిస్థితి ఎలా ఉంది? కేసులపై ఎందుకు దాగుడు మూతలు ఆడుతున్నారు. సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బంది పెట్టడనికేనా? అన్ని స్టేట్లలో కరోనా వైరస్ ఆందోళనకర స్థాయిలో విరుచుకుపడుతుంటే ఇక్కడ మాత్రం అలా లేదని చెప్పేందుకు ప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. వాస్తవాలను దాచి ప్రజలతో ఆటలాడుతోందని పలువురు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. ఎవరి కోసం ఈ నాటకాలు? ఎందుకోసం దొంగ లెక్కలు? వాస్తవాలు చెప్పి ప్రజా జీవనాన్ని సరైన మార్గంలో పెట్టేందుకు ప్రయత్నాలు చేయకుండా అసలు జరిగిందాన్ని దాచి అబద్ధాన్ని ప్రచారం చేయాలని చూడడం సహేతుకరం కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో పారదర్శకతకు పెద్దపీట వేయాలని ప్రజలు భావిస్తున్నారు.