RTI Act: దేశంలో సామాన్యుడి చేతిలో వజ్రాయుధం లాంటిది సమాచార హక్కు చట్టం అని అక్టోబర్ 10, 2012లో చెప్పింది. ప్రభుత్వంలో ఏ విషయం కావాలన్నా ఇట్టే తీసుకోవచ్చని తెలుస్తోంది. కానీ ఇది ప్రస్తుతం మన చేతికి అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది. ఇక నుంచి ప్రభుత్వం నుంచి ఏ సమాచారం కావాలని అడిగినా దానికి రాష్ర్ట స్థాయి అధికారుల అనుమతి తప్పనిసరి అని జీవో తీసుకొచ్చింది. దీంతో సామాన్యుడికి ప్రస్తుతం సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉండని అందని ద్రాక్షగానే మిగలనుందని తెలుస్తోంది.

ఇదివరకు గ్రామస్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు అన్ని రంగాల్లో ఏ సమాచారం కావాలన్నా ఒక్క దరఖాస్తు సమర్పిస్తే చాలు అన్ని వివరాలు మనకు లభించేవి. కానీ ప్రభుత్వానికి వస్తున్న చిక్కుల నేపథ్యంలో సమాచార హక్కు చట్టం ఫలితాలు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉండేందుకే ప్రభుత్వం కుట్రలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయాలను ఇరవై నాలుగు గంటల్లో వెబ్ సైట్లో పెట్టాలని హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం చేసే పనులు ఏవీ కూడా ప్రజలకు తెలియకుండా పోతున్నాయి.
ఆర్టీఐ చట్టం తో ప్రజలు ఎంతో లాభం పొందినా ప్రభుత్వానికి మాత్రం తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వంలో జరుగుతున్న పనుల గురించి ప్రజలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అందులోని లోపాలు ఎత్తి చూపడంతో నష్టాలే మిగులుతున్నాయి. ఇటీవల కాలంలో హైదరాబాద్ లో భూముల అమ్మకంలో ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది? అందులో ఎంత మేర వినియోగిస్తున్నారు? తదితర విషయాలు వెలుగులోకి రావడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. దీంతో ఎవరికి కూడా సమాచార హక్కు చట్టం అందుబాటులో ఉండకుండా చేసేందుకే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తెలంగాణ సర్కారు సమాచార హక్కు చట్టం వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రణాళికలు వేసుకుందని తెలుస్తోంది. దీని ప్రకారమే ఆర్టీఐ అందుబాటులో ఉండకుండా సామాన్యులకు వివరాలు దొరకకుండా చేసే పనికి పూనుకుంది. ఇందులో భాగంగానే ఆర్టీఐని రాష్ర్ట స్థాయి అధికారికి లింకు పెట్టి అడ్డుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చి తన కుట్రలో భాగంగానే అమలు చేసింది.