Delhi Red Fort Blast: సోమవారం ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర కారులో బాంబు పేలుడు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 12 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. వాస్తవానికి ఈ ఘటనకు పాల్పడింది జై షే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు. వాస్తవానికి ఈ ఘటన కంటే ముందు భారత పోలీసులు ఉగ్రవాదుల మాడ్యూల్ గుర్తించారు. దీన్ని చేదించే క్రమంలో పోలీసులు అనేకమంది ఉగ్రవాదులను అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్నారు. ఈలోగానే ఢిల్లీ ఘటన జరిగింది. ఈ ఘటన తర్వాత మన దేశ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఢిల్లీలో కారు లో బాంబు పేలుడు చోటు చేసుకున్న తర్వాత.. మన దేశ పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు మొదలు పెడితే దిగ్భ్రాంతి కరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఉగ్రవాదులు కేవలం ఎర్రకోట సమీపంలో కారు బాంబు పేలుడు మాత్రమే కాకుండా.. అంతకుమించిన దారుణాలకు పాల్పడేందుకు రూపకల్పన చేశారని తెలుస్తోంది. బాబ్రీ మసీదు కూల్చివేసిన డిసెంబర్ 6న ఢిల్లీలో వరుసగా బాంబు పేలుళ్లు జరపాలని వైద్యుల ముసుగులో ఉన్న ఉగ్రవాదులు ప్లాన్ రూపొందించిన తెలుస్తోంది. ఏకంగా ఆరు దశలలో దాడులు నిర్వహించడానికి 32 కార్లను సిద్ధంగా ఉంచినట్టు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారుల దర్యాప్తులో ఉగ్రవాదులు చెప్పినట్టు తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో ఒక కారులో భీకరమైన పేలుడు సంభవించింది. అయితే ఈ కారు మాత్రమే కాకుండా మారుతి సుజుకి బ్రీజా, స్విఫ్ట్ డిజైర్, ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ వంటి కార్లను తమ కుట్రకు వాడుకునే విధంగా రూపకల్పన చేసినట్టు ఉగ్రవాదులు చెప్పారు..
ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో హుండాయ్ ఐ10 కార్ పేలిపోయింది. ఈ కారును డాక్టర్ నబి తోలాడు. ఈ కారు హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ ప్రాంతంలోని ఆల్ ఫలాహ్ యూనివర్సిటీలో లభ్యమైనది. దీంతో ఉగ్రవాదుల ప్లాన్ ఒక్కసారిగా బెడిసి కొట్టింది. ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుళ్లు.. ఆ కారులో నబి డిఎన్ఏ లభ్యం కావడం.. ఆల్ పలాహ్ యూనివర్సిటీలో ఉమర్ కారు ప్రత్యక్షమైంది. దీంతో దర్యాప్తు సంస్థలు ఈ యూనివర్సిటీ పై దృష్టి పెట్టాయి. ఉగ్రవాదులు ఈ విశ్వవిద్యాలయాన్ని తమ కార్యకలాపాలకు కేంద్రంగా మార్చుకున్నట్టు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.