Delhi Liquor Scam : సుప్రీంకోర్టుకు కవిత కీలక అభ్యర్థన.. ఓకే చెప్పిన న్యాయస్థానం..

ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన కేసులో అకారణంగా అరెస్టు చేశారని కవిత తరఫున న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారులు అరెస్టు చేశారని వారు పిటిషన్ లో ప్రస్తావించారు.

Written By: NARESH, Updated On : March 19, 2024 6:26 pm

MLC Kavitha

Follow us on

Delhi Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయి.. ఎన్ ఫోర్స్ మెంట్ అధికారుల విచారణలో ఉన్న భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కీలకమైన అభ్యర్థన చేశారు. “నా తల్లి, కుమారులను కలిసేందుకు అనుమతించాలని” కోరారు. ఈ మేరకు కవిత తరఫున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. కవిత తన తల్లి శోభ, కుమారుడు ఆదిత్య, ఆర్య, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిని కలవాలని ఉందని కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో తల్లి, కుమారులు, కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు కవితకు న్యాయస్థానం ఓకే చెప్పింది.

ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు కవితను అరెస్టు చేసిన రోజు.. ఆమె భర్త అనిల్, బావ హరీష్ రావు, సోదరుడు కేటీఆర్, ఇతర సోదరులు ప్రణీత్ కుమార్, శ్రీధర్, వ్యక్తిగత సహాయకుడు శరత్ చంద్ర ను కలిసేందుకు కోర్టు అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఆమె వారం పాటు ఈడీ కస్టడీలో ఉండనున్నారు. ఇప్పటికే రెండు రోజులు గడిచిపోయాయి. కస్టడీలో ఉన్నన్నీ రోజుల్లో ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు బంధువులను కలుసుకునేందుకు కవితకు న్యాయస్థానం అనుమతించింది. అయితే ఎక్కువ మందిని కలవడం వల్ల దర్యాప్తుకు ఇబ్బంది అవుతుందని.. ఈరోజు కవిత తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్ పై జరిగిన విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది. అంతకుముందు సోదరుడు కేటీఆర్, ఆమె తల్లి, కుమారులు, సోదరీమణులు అఖిల, సౌమ్య, వినుత, సోదరుడు ప్రశాంత్ రెడ్డిని కలిసేందుకు అనుమతించారని కోర్టుకు గుర్తు చేశారు. గతంలో అనుమతించిన వారినైనా కలిసేలా ఆదేశాలు జారీ చేయాలని కవిత తరఫున న్యాయవాదులు కోరారు. దీంతో న్యాయస్థానం అంగీకరించింది.

ఢిల్లీలో మద్యం విధానానికి సంబంధించిన కేసులో అకారణంగా అరెస్టు చేశారని కవిత తరఫున న్యాయవాదులు సోమవారం సుప్రీంకోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసు పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారులు అరెస్టు చేశారని వారు పిటిషన్ లో ప్రస్తావించారు. విచారణ సందర్భంగా తనకు సమన్లు జారీ చేయవమని ఈడి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారని కవిత తరపున న్యాయవాదులు గుర్తు చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన ఈడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని కవిత తరఫున న్యాయవాది ఆన్ లైన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నది. మరికొద్ది గంటల్లో కోర్టు దీనిపై తుది తీర్పు ఇవ్వనుంది.