దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ 70 స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీగా తలపడ్డాయి. దానికి తగినట్లుగానే ప్రస్తుతం ఫలితాల ట్రెండ్స్ వస్తున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు ఎగ్జాక్ట్ ఫలితాలు అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్‌లో బీజేపీ ఆధిక్యం కనబర్చింది. ఇక ఈవీఎం ఓట్ల లెక్కింపులోనూ బీజేపీ అదే దూకుడు కనబర్చింది. మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత 50 శాతానికిపైగా ఓట్లతో బీజేపీ 48 స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.« దీంతో ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 36ను దాటేసింది. ఇక అధికార ఆప్ పార్టీ కేవలం 21 స్థానాల్లోనే అధిక్యం కనబరుస్తోంది. ఈ 21 స్థానాల్లో 10 స్థానాలు ముస్లిం ఓట్లు ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలే.
వెనుకంజలోనే ఆ ముగ్గురు..
ఇక తాజా ఫలితాలు చూస్తుంటే ఆప్ అధినేత కేజ్రీవాల్ పోటీ చేసిన న్యూఢిల్లీ స్థానంలో ఆయన వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ నుంచి ఈవీఎం రెండో రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఆయన వెనుకబడే ఉన్నారు. ఆయనపై బీజేపీ అభ్యర్థి 1,500 కోట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఇక మనీష్ సిసోడియా పోటీ చేసిన జంగ్‌పురాలో కూడా ఆయన వెనుకబడే ఉన్నారు. అక్కడ కూడా ఈవీఎం రెండు రౌండ్ల లెక్కింపు పూర్తయింది. ఆయన రెండో స్థానంలో కొనసాగుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్న సీఎం అతిశీ కూడా అదే పరిస్థితి. ఆమె కూడా రెండో స్థానంలో ఉన్నారు. కాంగ్రెస్ ఈ మూడు నియోజకవర్గాల్లో మూడో స్థానానికే పరిమితమైంది.
52 శాతం ఓట్లు..
ఇక ఓట్ల షేరింగ్‌లోనూ బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. రెండు రౌండ్లు ముగిసే సరికి బీజేపీ 50.3 శాతంపైగా ఓట్లు సాధించగా, ఆప్ 41.16 శాతానికి పరిమితమైంది. గత ఎన్నికల్లో ఆప్ 52 శాతం ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. ఈసారి ఆ ఓట్లను బీజేపీ కొల్లగొడుతోంది. కాంగ్రెస్ పార్టీ గతం కన్నా ఓట్ల శాతం మెరుగు పర్చుకుంది. ఈసారి 6 శాతం ఓట్లు సాధించింది.
చీపురు పార్టీ అడ్రస్ గల్లంతే..
ప్రస్తుతం ట్రెండ్స్ చూస్తుంటే.. ఈసారి చీపురు పార్టీగా గుర్తింపు ఉన్న ఆప్ ఓటమి దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆప్ పుంజుకునే అవకాశం కనిపించం లేదు. బీజేపీ ఈసారి చీపురు కట్ట ముడి విప్పేసి ఏ పుల్లకు ఆ పుల్లను విడదీసినట్లుగా ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ కనిపిస్తున్నాయి.