Delhi bomb blast: సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో మెట్రో స్టేషన్ దగ్గర పార్కింగ్ లో ఉన్న కారు పేలింది. ఈ ఘటనలో 12 మంది చనిపోయారు. 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన కంటే ముందు దేశంలోని పలు ప్రాంతాలలో ఉగ్రవాదులను భారత పోలీసులు అరెస్ట్ చేశారు. వారి మాటలు నాశనం చేసే ప్రక్రియలో భారత పోలీసులు బిజీగా ఉన్నారు.. ఇదంతా జరుగుతుండగానే ఢిల్లీలో బాంబు పేలుడు చోటుచేసుకుంది.
బాంబు పేలుడు జరిగిన తర్వాత సిసి ఫుటేజ్ లను పోలీసులు పరిశీలించారు.. ఇందులో భాగంగానే ఈ పేలుడుకు కారణమైన కారులో డాక్టర్ ఉమర్ నబి డిఎన్ఏ సరిపోలింది. ఫోరెన్సిక్ ల్యాబ్ ఈ విషయాన్ని ప్రకటించిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. ఎర్రకోట వద్ద జరిగిన ఈ ప్రమాదానికి ముందు ఉమర్ కారు నడిపాడు. దానికి సంబంధించిన దృశ్యాలను పోలీసులు సిసి కెమెరాలలో గుర్తించారు. ఆ సమయంలో కారులో ఉన్న ఉమర్ కూడా ప్రాణాలు కోల్పోయి ఉంటాడని అధికారులు మొదట్లో భావించారు. ఈ నేపథ్యంలో పుల్వామా ప్రాంతంలో నివాసం ఉంటున్న అతని కుటుంబ సభ్యుల డిఎన్ఏ నమూనాలను సేకరించారు. వాటి ద్వారా పరీక్షించగా కారులో లభించిన నబీ డిఎన్ఏ తో మ్యాచ్ అయింది.. పేలుడు జరిగిన సమయానికి ఉమర్ కారులో ఉన్నాడని తెలుస్తోంది.
ఎర్రకోట వద్ద హ్యుందాయ్ i20 కారులో ఈ పేలుడు చోటుచేసుకుందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కారు నడిపింది ఉమర్ అని పోలీసులు సిసి దృశ్యాల ఆధారంగా గుర్తించారు. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్ తో సంబంధాలు ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఇంకా కొన్ని విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ ఘటనకు ముందు కుమార్ ఒక మసీదుకు వెళ్ళాడు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి. సోమవారం సరిగ్గా మధ్యాహ్నం ఎర్రకోట వైపునకు వెళ్లడానికి ముందు రాంలీలా మైదానంలో ఉన్న ఓ మసీదు కు ఉమర్ వెళ్ళాడు. అక్కడ దాదాపు పది నిమిషాల వరకు ఉన్నాడు. ఇక ఈ పేలుడు తర్వాత ఉమర్ కాలు స్టీరింగ్ వీల్, యాక్సిలేటర్ మధ్య ఇరుక్కుపోయిందని పోలీసులు ప్రకటించారు.