https://oktelugu.com/

CPI, CPM Parties: కమ్యూనిస్టులది తెలంగాణా లో ఘన చరిత్ర.. మునుగోడుతో అప్రతిష్ట

CPI, CPM Parties :మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీలు జతకడుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు గత్యంతరం లేదు. టీఆర్ఎస్ ఒక్కటే వారికి స్వచ్ఛంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీని నిలువరించాలనే ఉద్దేశంతో వారి సపోర్టు టీఆర్ఎస్ కు ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ త్వరలో రానుంది. దీంతో రాజకీయ వేడి రగులుకుంటోంది. బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్ కే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 12, 2022 10:39 pm
    Follow us on

    CPI, CPM Parties :మునుగోడులో అధికార టీఆర్ఎస్ పార్టీతో కమ్యూనిస్టు పార్టీలు జతకడుతున్నాయి. బీజేపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగానే సీపీఐ, సీపీఎం పార్టీలు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కమ్యూనిస్టులకు గత్యంతరం లేదు. టీఆర్ఎస్ ఒక్కటే వారికి స్వచ్ఛంగా కనిపిస్తోంది. దీంతో బీజేపీని నిలువరించాలనే ఉద్దేశంతో వారి సపోర్టు టీఆర్ఎస్ కు ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికల షెడ్యూల్ త్వరలో రానుంది. దీంతో రాజకీయ వేడి రగులుకుంటోంది. బీజేపీని ఓడించే సత్తా టీఆర్ఎస్ కే ఉందని కమ్యూనిస్టులు ఆలోచిస్తున్నారు. కేంద్ర నాయకత్వం సూచనల మేరకే వారు టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు.

    బీజేపీ భావజాలాన్ని వ్యతిరేకించే క్రమంలో టీఆర్ఎస్.. కమ్యూనిస్టులను చేరదీసినట్లు సమాచారం. తెలంగాణలో కమ్యూనిస్టులకు టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ కనిపించడం లేదు. ఈ క్రమంలో కమ్యూనిస్టులు తీసుకున్న నిర్ణయంతో మత ప్రాతిపదికన విభజించే బీజేపీని నిలువరించాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ప్రచారంలోకి వస్తోంది. కాంగ్రెస్ ను దూరం చేయాలంటే బీజేపీపై వ్యతిరేకత ఉన్నట్లు భావిస్తే అది కాంగ్రెస్ ఓటు బ్యాంకును కూడా చీల్చే అవకాశం ఉంది. దీంతోనే పక్కా వ్యూహం ప్రకారమే కేసీఆర్, బీజేపీ డ్రామాలు ఆడుతున్నారని కాంగ్రెస్ మండిపడుతోంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో దూరమైనా ఇక్కడ మాత్రం గెలిచి తీరుతామని కాంగ్రెస్ బింకాలు ప్రదర్శిస్తుంటే చివరకు ఏం జరుగుతుందో చూడాల్సిందే.

    మునుగోడు లో కమ్యూనిస్టుల తీరు అప్రతిష్ట పాలవుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చరిత్రలో నిలబడ్డ కమ్యూనిస్టులు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వడం చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఈక్రమంలోనే తెలంగాణలో కమ్యూనిస్టుల చరిత్ర.. పడిపోయిన విధానంపై ‘రామ్’ గారి మార్క్ సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..

    కమ్యూనిస్టులది తెలంగాణా లో ఘన చరిత్ర | CPI, CPM Parties To Support Congress In Munugode | View Point