Homeజాతీయ వార్తలుKCR- Left Parties: కేసీఆర్‌ మెడ మీద కత్తిపెట్టి అడుతున్నాయి..!!

KCR- Left Parties: కేసీఆర్‌ మెడ మీద కత్తిపెట్టి అడుతున్నాయి..!!

KCR- Left Parties
KCR- Left Parties

KCR- Left Parties: ఉద్యమం ఏదైనా.. పోరాటం ఏరూపంలో∙జరుగుతున్నా.. సమస్య ఎక్కడ ఉన్నా.. టక్కున వాలిపోయి ఓన్‌ చేసుకునే పార్టీలు వామపక్షాలు. ఉద్యమంలో ఆ పార్టీలతో కలిసిపోయే ప్రజలు ఎన్నికల్లో మాత్రం వాటిని గెలిపించడం లేదు. ఆ పార్టీల అభ్యర్థులకు ఓట్లు వేయడం లేదు. దీంతో వామపక్షాలకు పరిస్థితి అర్థమైంది. గెలిచే సత్తా తమకు లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని నిర్ణయానికి వచ్చారు. దీంతో ఎన్నిల్లో ఇక పొత్తులకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో మునుగోడు ఉప ఎన్నిక రూపంలో బీఆర్‌ఎస్‌ ఎర్రజెండా పార్టీల తలుపు తట్టింది. వెతకబోయిన పార్టీ కాలికి తగిలినట్లు.. కేసీఆర్‌ అడిగిందే తడవుగా మద్దతు ఇచ్చేశారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని గెలిపించారు. దీంతో తాము సొంతంగా గెలవకపోయినా పొత్తులతో గెలుస్తామని అనుకుంటున్నారు. పొత్తు లేకుంటే గెలిచే అభ్యర్థులను ఓడించడం ఖాయమనుకుంటున్నారు. దీంతో తమకు గౌరవంగా ఉండే స్థానాలను ఇస్తే బీఆర్‌ఎస్‌తో వచ్చే ఎన్నికల్లో పొత్తు ఉంటుందని చెప్తున్నారు లెఫ్ట్‌ పార్టీల నాయకులు.

Also Read: Tummalapalli Kalakshetram: తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చేశారు.. జగన్ పాలనలో అంతే

సీట్లు ఇస్తేనే పొత్తు..
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే పాదయాత్రలు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని అనేక పార్టీల నాయకులు ప్రజాక్షేత్రంలోకి వెళ్లి తమను ఆదరించాలని కోరుతున్నారు. మరోవైపు వైపు పొత్తుల రాజకీయాలు తెర మీదకు వస్తున్నాయి. తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని బీఆర్‌ఎస్‌ కసరత్తు చేస్తోంది. మరోవైపు బీఆర్‌ఎస్‌తో పొత్తుపై లెఫ్ట్‌ పార్టీలు తాజాగా భేటీ కాబోతున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండాలంటే తమకు గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని íసీపీఐ, సీపీఎం పార్టీలు స్పష్టం చేస్తున్నాయి. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటామని చెబుతున్నాయి.

సీట్లపై ఇప్పటికే క్లారిటీ..
బీఆర్‌ఎస్‌ పార్టీతో చర్చించాల్సి వస్తే ఏయే స్థాతనాలు అడగాలన్నదానిపై పార్టీలు లెక్కలు వేస్తున్నాయి. ఈమేరకు ప్రత్యేక సమావేశం నిర్వహించి ప్రాథమికంగా ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి తమకు బలమున్న స్థానాలపైన చర్చించి ఆయా స్థానాలలో పోటీ చేయడానికి అవకాశం ఇవ్వాలని బీఆర్‌ఎస్‌ను కోరాలని భావిస్తున్నట్లు తెలిసింది.

చెరో పది స్థానాలు..
పొత్తులో భాగంగా సీపీఎం, సీసీఐ పార్టీలు చెరో పది సీట్లు అడగాలని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. చివరకు చెరో ఐదు సీట్లకు ఐనా పొత్తు కుదరకపోతుందా అని భావిస్తున్నట్లు సమాచారం. అదీ సాధ్యం కాకపోతే చివరకు చెరో రెండు అసెంబ్లీ స్థానాలను కోరడంతోపాటు, రెండు ఎమ్మెల్సీ సీట్లుల అయినా అడగాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా సీపీఐ కొత్తగూడెం స్థానాన్ని, సీపీఎం భద్రాచలం స్థానాన్ని తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.

బీఆర్‌ఎస్‌ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు..
లెఫ్ట్‌ పార్టీలతో పొత్తులు, సీట్ల కేటాయింపుపై కొందరు బీఆర్‌ఎస్‌ నేతలు వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. వారికి అసెంబ్లీ ఎన్నికల్లో ఎటువంటి సీట్లు కేటాయించేది లేదని, చెరో ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామన్నట్టుగా చేస్తున్న వ్యాఖ్యలపై సీపీఐ, సీపీఎం నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఒకవేళ అటువంటి ఆలోచన చేస్తే తమ దారి తాము చూసుకుంటామని పేర్కొంటున్నారు. తమకు సొంతంగా గెలిచే సత్తా లేకున్నా ఓడించే దమ్ము మాత్రం ఉందని బీఆర్‌ఎస్‌ నాయకులను హెచ్చరిస్తున్నారు. తమను తక్కువగా అంచనా వేస్తే నష్టపోయేది బీఆర్‌ఎస్‌ పార్టీనే అని స్పష్టం చేస్తున్నారు. బీజేపీకి చెక్‌ పెట్టాలంటే తమతో కలిసి రావాలని సూచిస్తున్నారు.

KCR- Left Parties
KCR

పొత్తు కుదిరితే వామపక్ష పార్టీలు సీపీఐ, సీపీఎం కూడా పరస్పరం పోటీగా అభ్యర్థులను నిలుపొద్దన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కేసీఆర్‌ మెడపై పొత్తుల కత్తిని పెట్టిన వామపక్షాలు మంగళవారం జరిగే కీలక సమావేశంలో ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది.

Also Read:Dil Raju- Harish Shankar: పవన్ సినిమా గ్యాప్ లో.. దిల్ రాజు తో హరీష్ శంకర్ కొత్త సినిమాకు రెడీ..

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular