https://oktelugu.com/

డేంజర్: కరోనా థర్డ్ వేవ్ వచ్చేసింది.!

  మాయ దారి కరోనా వచ్చేసింది. ఆ దేశంపై విరుచుకుపడుతోంది. కరోనా రూపు మార్చుకుంటూ వేవ్ ల పేరిట ఇంకా ప్రపంచాన్ని కబళిస్తూనే ఉంది. భారత్ లో సెకండ్ వేవ్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న వేళ మరోసారి థర్డ్ వేవ్ తప్పదన్న ఆందోళనలు ప్రజలను భయపెడుతున్నాయి. అందరూ భయపడ్డట్టే జరుగుతోంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో రాబోతోంది. గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మెక్సికో దేశంలో కరోనా థర్డ్ వేవ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : July 11, 2021 / 10:18 AM IST
    Follow us on

     

    మాయ దారి కరోనా వచ్చేసింది. ఆ దేశంపై విరుచుకుపడుతోంది. కరోనా రూపు మార్చుకుంటూ వేవ్ ల పేరిట ఇంకా ప్రపంచాన్ని కబళిస్తూనే ఉంది. భారత్ లో సెకండ్ వేవ్ తగ్గి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్న వేళ మరోసారి థర్డ్ వేవ్ తప్పదన్న ఆందోళనలు ప్రజలను భయపెడుతున్నాయి.

    అందరూ భయపడ్డట్టే జరుగుతోంది. కరోనా మహమ్మారి థర్డ్ వేవ్ రూపంలో రాబోతోంది. గత వారం రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మెక్సికో దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందని ఆ దేశ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

    మెక్సికోలో వారం రోజులుగా కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మునుపటి వారంతో పోల్చితే ఈ వారం 29శాతం ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. శుక్రవారం 9వేలకు పైగా కొత్త కేసులు నమోదు కావడంతో ఆ దేశం ప్రజలకు హెచ్చరికలుజారీచేసింది.

    కరోనా సెకండ్ వేవ్ మెక్సికో దేశంలో గత ఏడాది సెప్టెంబర్ లో మొదలైంది. జనవరి వరకు దేశాన్ని అతలాకుతలం చేసింది. క్రమంగా కేసుల సంఖ్య తగ్గుతూ జులై మాసంలో సెకండ్ వేవ్ ముగిసింది.

    సెకండ్ వేవ్ ముగిసిందని ప్రజలంతా హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న వేళ.. మరో నెల రోజుల వ్యవధిలోనే అక్కడ థర్డ్ వేవ్ మొదలైంది. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉన్నట్లు మెక్సికో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

    ఇక మెక్సికో దేశం ముఖ్యంగా యువతకు హెచ్చరికలు జారీ చేసింది. ఈసారి ఎక్కువగా యువకులు కరోనా బారిన పడుతారని మెక్సికో దేశం ప్రకటించింది. యువకులు, ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువ అనుకున్న వారు వ్యాక్సిన్లు వేసుకోకపోవడమే థర్డ్ వేవ్ లో వారు కరోనా బారినపడడానికి కారణం అని అక్కడి ప్రభుత్వం తెలిపింది. వెంటనే అందరూ వ్యాక్సిన్లు వేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.

    ఇక మెక్సికో దేశంలో 39శాతం మందికి ఒక వ్యాక్సిన్ డోసు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.మెక్సికో దేశంలో దాదాపు 13 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇక డెల్టా వేరియంట్ నే కరోనా థర్డ్ వేవ్ కు కారణం అని వారు భావిస్తున్నారు.