Corona: శ్రీలంక చిన్నాభిన్నమవుతోంది. ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఎటు చూసినా కరువు పరిస్థితులే. ఎక్కడ చూసినా ఆకలి బాధలే. చిన్న పిల్లలకు సైతం ఒక్క పూట తిండి దొరకని పరిస్థితి. దీంతో దేశం యావత్తు ఆందోళనలో పడిపోతోంది. ఈ నేపథ్యంలో దేశాన్ని గాడిలో పెట్టడం అంత సులువైన పని కాదని తెలుస్తోంది. కానీ దేశం ఇంత దిగజారడానికి కారణం మాత్రం చైనానే అని తెలుస్తోంది. చైనా కుట్రలకు బలైన దేశంగా శ్రీలంక నానా తిప్పలు పడుతోంది.

దేశంలో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. దీంతో ఆహార పదార్థాలు దొరకడం లేదు. ఒక్క పూట కూడా తిండి దొరకడం లేదు. దీంతో పసిపిల్లలకు సైతం భోజనం అందడం లేదు. దీంతో వారు ఉపవాసాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరికొద్ది రోజులు ఇలాగే ఉంటే ఆకలితో అలమటించి మరణిస్తారని తెలుస్తోంది. కానీ శ్రీలంక మాత్రం ఎలాంటి దిద్దుబాటు చర్యలు చేపట్టడం లేదు.
Also Read: వైరల్ అవుతున్న బాలయ్య ‘మంగళవారం మెనూ’ వీడియో !
చైనా కుట్రలో చిక్కి శ్రీలంక చిక్కిశల్యమవుతోంది. దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటోంది. కరువు ధాటికి కకావికలం అవుతోంది. ఆకలి చావులు ప్రబలమవుతున్నాయి. అయినా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఫలితంగా పేదవారికి ఇక చావే గతి అనే దుస్థితి దాపురించింది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది. ఎటు చూసినా కరువు గుండెలను బరువుగా మారుస్తోంది. దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. తమకు దిక్కెవరని గుండెలవిసేలా రోదిస్తున్నారు.

కరోనా మహమ్మారి కూడా దేశాన్ని దుర్భర స్థితిలోకి నెట్టింది. వైరస్ మూలంగా దేశ ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. ఫలితంగా దేశం దీనస్థితికి చేరుకుంది. దేశంలో ఆహార సంక్షోభం మరింత తీవ్ర రూపం దాల్చుతోంది. రోజురోజుకు పరిస్థితి చేయి దాటి పోతోంది. ఈ నేపథ్యంలో దేశ భవిష్యత్ అంధకారంలో పడుతోంది. ఆహార కొరత ప్రజలను నిలువెల్లా వేధిస్తోంది.
శ్రీలంక చైనా పన్నిన కుట్రల్లో ఇరుక్కుని ఫలితం అనుభవిస్తోంది. దాన్ని నమ్మిన శ్రీలంక ఎడాపెడా అప్పులు చేసి ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. దీంతో ప్రస్తుతం దేశం బాధల్లో బందీ అయింది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజల నెత్తిన భారం పడుతోంది. ఆహారం కోసం వారు ఎన్నో వ్యయప్రయాసలు పడాల్సి వస్తోంది. పచ్చి మిర్చి కిలో రూ.700 ఉందంటే ధరలు ఎంతలా పెరిగాయో అర్థమవుతోంది. ఈ క్రమంలో శ్రీలంకను ఆదుకోవడం అంత సులువు కాదనే విషయం తెలిసిపోతోంది. ఏదిఏమైనా ఏ నాయకుడైనా దేశాన్ని సరైన గాడిలో పెట్టి ఆహార సంక్షోభాన్ని తీర్చాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
Also Read:ధనుష్-ఐశ్వర్య విడాకులకు ఆ ఇద్దరు హీరోయిన్లే కారణమా?