https://oktelugu.com/

టీఆర్‌‌ఎస్‌కు జానారెడ్డి సవాల్‌.. అంగీకరించని అధికారపక్షం

మరికొద్ది రోజుల్లో నాగార్జునసాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి విసిరిన సవాల్‌ టీఆర్‌‌ఎస్‌లో ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ సవాల్‌పై స్పందించకుండా ఇతర అంశాలపై జానారెడ్డిపై నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం జానారెడ్డి సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకూ జానారెడ్డి చేసిన సవాల్ ఏమిటంటే.. నామినేషన్లు వేసి అందరం ప్రచారం చేయకుండా […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 29, 2021 / 01:25 PM IST
    Follow us on


    మరికొద్ది రోజుల్లో నాగార్జునసాగర్‌‌ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ నేపథ్యంలో అక్కడి రాజకీయాలు ఇప్పుడు హాట్‌హాట్‌గా మారాయి. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి జానారెడ్డి విసిరిన సవాల్‌ టీఆర్‌‌ఎస్‌లో ఇప్పుడు చర్చకు దారితీసింది. ఆ సవాల్‌పై స్పందించకుండా ఇతర అంశాలపై జానారెడ్డిపై నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం జానారెడ్డి సవాల్‌ను స్వీకరించాలని డిమాండ్ చేస్తున్నారు.

    ఇంతకూ జానారెడ్డి చేసిన సవాల్ ఏమిటంటే.. నామినేషన్లు వేసి అందరం ప్రచారం చేయకుండా సైలెంట్‌గా ఉందాం.. ప్రజలు ఎవరికి ఇష్టం వచ్చినవారికి ఓట్లు వేయనిద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దామని జానారెడ్డి సవాల్‌ విసిరారు. ఇదేదో బాగున్నట్లు అనిపించినా.. టీఆర్ఎస్ నేతలకు మాత్రం నచ్చలేదు. దాంతో జానారెడ్డి ఔట్ డేటెడ్ అంటూ విమర్శలు ప్రారంభించారు. కానీ.. ఆ సవాల్‌కు ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేదు.

    అంతేకాదు.. ఇప్పటివరకు టీఆర్‌‌ఎస్‌ అభ్యర్థిని మాత్రం ఆ పార్టీ ఖరారు చేయలేదు. ఎవరిని ఖరారు చేసినా.. ఇంకో ఆశావహుడు బీజేపీలోకి వెళ్లి ఆ పార్టీ తరపున పోటీ చేయడానికి సిద్ధంగా ఉంటారన్న అంచనాలు కేసీఆర్‌‌లో ఉన్నాయి. అందుకే.. ఈ విషయంపై కేసీఆర్‌‌ ఎటూ తేల్చడం లేదని విమర్శలు వస్తున్నాయి. నోముల నర్సింహయ్య కుమారుడు నోముల భగత్‌కే టిక్కెట్ ఖరారు చేసినట్లుగా అంతర్గతంగా పార్టీ నేతలకు సమాచారం అందింది. ఆశావహులకు కూడా సంకేతాలు వెళ్తున్నాయి. దీంతో వారు కూడా వేచి చూస్తున్నారు.

    అయితే.. జానారెడ్డి మాత్రం ఈ విషయంలో చాలా ముందు ఉన్నారు. ఓ రౌండ్ ప్రచారం పూర్తి చేసేశారు. గ్రామగ్రామాన ఉన్న అనుచరులతో పరస్థితుల్ని అనుకూలంగా మల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల బరి టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా సాగడానికి ఇప్పటికే గ్రౌండ్ వర్క్‌ కంప్లీట్‌ చేసేశారు. అందులో భాగంగా సవాళ్లు నడుస్తున్నాయని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. బీజేపీకి చోటు లేదని చెప్పడానికి.. బీజేపీకి వచ్చిన హైప్‌ను తగ్గించడానికి కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే కౌంటర్‌గా టీఆర్ఎస్ నేతనే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టాలన్న ప్రణాళికతో ఉంది. మొత్తానికి సాగర్‌‌ ఉప ఎన్నికలో పార్టీల స్టాండ్‌ మాత్రం ఎటూ అర్థం కాకుండా ఉంది. ఏ పార్టీ ఎలాంటి వైఖరితో వెళ్తోందో తెలియడం లేదు.