గుజరాత్ లో కాంగ్రెస్ ‘ఆకర్ష్’ రాజకీయం!

గతంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలను `ఆకర్ష్ కమల్’ పేరుతో ఆకట్టుకొని కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి, కర్ణాటకలో అధికారం చేపట్టిన బిజెపి తీరులో గుజరాత్ లో బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్ పావులు కడుపుతున్నది. ప్రస్తుతం అక్కడ బీజేపీ బొటా బొటా ఆధిక్యతలో అధికారమలో కొనసాగుతున్నది. పైగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లకు సొంత రాష్ట్రం కావడం; వారిద్దరికీ ఇష్టుడైన ముఖ్యమంత్రి విజయ్ […]

Written By: Neelambaram, Updated On : March 3, 2020 10:35 am
Follow us on

గతంలో కాంగ్రెస్ ఎమ్యెల్యేలను `ఆకర్ష్ కమల్’ పేరుతో ఆకట్టుకొని కాంగ్రెస్ – జేడీఎస్ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించి, కర్ణాటకలో అధికారం చేపట్టిన బిజెపి తీరులో గుజరాత్ లో బిజెపి ప్రభుత్వాన్ని పడగొట్టి, అధికారం చేపట్టడం కోసం కాంగ్రెస్ పావులు కడుపుతున్నది.

ప్రస్తుతం అక్కడ బీజేపీ బొటా బొటా ఆధిక్యతలో అధికారమలో కొనసాగుతున్నది. పైగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోమ్ మంత్రి అమిత్ షా లకు సొంత రాష్ట్రం కావడం; వారిద్దరికీ ఇష్టుడైన ముఖ్యమంత్రి విజయ్ రూపాని పట్ల బిజెపి ఎమ్యెల్యేలలోనే తీవ్ర వ్యతిరేకంగా నెలకొనడంతో `ఆకర్ష్’ రాజకీయాలకు పాల్పడుతున్నట్లు కధనాలు వెలువడ్డాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ బంపర్ ఆఫర్ చేస్తున్నది. 20 మంది ఎమ్యెల్యేలతో బిజెపి నుండి వస్తే, వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని చెబుతున్నది. త్వరలో జరుగనున్న రాజ్యసభ ఎన్నికల ముందు గుజరాత్‌లో బీజేపీ ఎమ్మెల్యేలపై గాలం వేసేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్‌ ప్రయత్నిస్తోంది.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడు ఒకరు ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఇరవై మంది ఎమ్మెల్యేలను తన వెంట తీసుకుని కాంగ్రెస్‌ పార్టీలో చేరితో ముఖ్యమంత్రి పదవిని అప్పగిస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో లాథీ నియోజకవర్గ ఎమ్మెల్యే విర్జీ తుమారానే ఈ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనపై అధికార పార్టీలో ఒక్కసారిగా కలవరం మొదలైంది.

కాగా ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను బీజేపీ 99 స్థానాల్లో మాత్రమే విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉత్కంఠ పోరులో కాంగ్రెస్ కూటమికి 77 స్థానాలు దక్కాయి.

అయితే మరికొద్ది రోజుల్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుజరాత్‌ కీలకంగా మారింది. ఈ తరుణంలో బీజేపీ ఎమ్మెల్యేలకు తమ పార్టీలోకి లాగేందుకు ప్రణాళికలు రచిస్తోంది.