Homeజాతీయ వార్తలుMallu Swarajyam: మల్లు స్వరాజ్యం గురించి ఎవరికీ తెలియని రహస్యాలివీ

Mallu Swarajyam: మల్లు స్వరాజ్యం గురించి ఎవరికీ తెలియని రహస్యాలివీ

Mallu Swarajyam:  తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం (91) కన్నుమూశారు. అనారోగ్యంతో బంజారాహిల్స్‌ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు మల్లు స్వరాజ్యం. సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళగా గుర్తింపు పొందారు. 13 ఏళ్ల వయసులో పోరాటంలో పాల్గొని రజాకార్లను ఎదిరించిన ధీర వనితగా పేరుంది. 1931లో నల్లగొండ జిల్లా (ఇప్పుడు సూర్యాపేట) తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో జన్మించిన స్వరాజ్యం. రెండుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా పనిచేశారు.

Mallu Swarajyam
Mallu Swarajyam

భూస్వామ్య కుటుంబంలో ఉదయించిన అరుణ కిరణం
మల్లు స్వరాజ్యం కరివిరాల కొత్తగూడెం గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో భీమిరెడ్డి రామిరెడ్డి చొక్కమ్మ దంపతులకు 1931వ సంవత్సరంలో జన్మించారు. వీరికి వందలాది ఎకరాల భూమి కలదు వీరిది భూస్వామ్య కుటుంబం. 1945– 46వ సంవత్సరంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం సర్కారును గడగడలాడించారు. 1947– 46 వ సంవత్సరంలో స్వరాజ్యం గారి ఇంటిని నైజాం గుండాలు తగలబడ్డాయి. మల్లు స్వరాజ్యం సాయుధ పోరాటంలో అదిలాబాద్‌ ,వరంగల్, కరీంనగర్‌ జిల్లాలో పని చేశారు. నాడు దొరల దురహంకారాన్ని పాటల ద్వారా చైతన్య పరిచారు.

Also Read: YCP vs BJP: జగన్ పై జగడానికే బీజేపీ రెడీనా?

-మహిళ కమాండర్‌గా..
మల్లు స్వరాజ్యం మహిళ కమాండర్‌ గా కూడా పని చేశారు. అప్పటి నైజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యం గారిని పట్టిస్తే పదివేల రూపాయలు బహుమతి ఇస్తామని ప్రకటించారు. ఆంధ్ర మహాసభ పిలుపుతో తన పొలంలో పండిన వరి ధాన్యాన్ని పేదలకు పంచిపెట్టారు. వీరి భర్త మల్లు వెంకటనర్సింహారెడ్డి సీపీఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, ఉమ్మడి నల్గొండ జిల్లా కార్యదర్శిగా సుదీర్ఘకాలం పని చేశారు. వీరి సోదరులు భీమిరెడ్డి నరసింహారెడ్డి అప్పటి మిర్యాలగూడ నుంపార్లమెంటుడి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు నల్గొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పనిచేశారు. 1978 నుంచి∙83 వరకు మొదటి దఫా, రెండవ దఫా 1983 నుంచి∙84 వరకు రెండోసారి ఎమ్మెల్యేగా సీసీఎం పార్టీ తరఫున పనిచేశారు.

ఎంపీగా స్వల్ప ఓట్ల తేడాతో ఓడి..
మిర్యాలగూడ పార్లమెంటుకు పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగిన మద్యపాన వ్యతిరేక పోరాటంలో మల్లు స్వరాజ్యం ప్రముఖ పాత్ర పోషించారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకురాలిగా పనిచేశారు. మల్లు స్వరాజ్యంకి ఒక కూతురు వున్నారు. ఆమె పేరు పాదూరి కరుణ. ఆమెకు ఇద్దరు కుమారులు ఒక కూతురు పెద్ద కుమారుడి పేరు మల్లు గౌతమ్‌ రెడ్డి ఆయనకు ఒక కొడుకు ఒక కూతురు. చిన్న కుమారుడు మల్లు నాగార్జునరెడ్డికి ఇద్దరు కుమారులు వున్నారు. వీరి చిన్న కోడలు మల్లు లక్ష్మి గత పార్లమెంట్‌ ఎన్నికలలో నల్గొండ ఎంపీగా పోటీ చేశారు. వీరి పెద్ద కుమారుడు మల్లు గౌతంరెడ్డి íసీపీఎం నల్గొండ జిల్లా కమిటీ సభ్యునిగా పని చేస్తున్నారు. చిన్న కుమారుడు మల్లు నాగార్జున్‌రెడ్డి సీపీఎం సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా పని చేస్తున్నారు.

Mallu Swarajyam
Mallu Swarajyam

-జీవిత విశేషాలు
– సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కొత్తగూడెం గ్రామంలో 1931లో జన్మించిన మల్లు స్వరాజ్యం నిజాం సర్కారుకు ముచ్చెమటలు పట్టించి, రజాకార్ల పాలిటి సింహస్వప్నమై నిలిచింది. – 1945–48 సంవత్సరాల్లో సాయుధ పోరాటాల్లో క్రియాశీలక పాత్ర పోషించి నైజాం సర్కారును గడగడలాడించింది.
– ఈమె పోరాటాల ధాటికి తట్టుకోలేక 1947–48లో ఈమె ఇంటిని పూర్తిగా దగ్ధం చేశారు.
– మల్లు స్వరాజ్యం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలో గిరిజనులను మేల్కొల్పింది.

ఈమె జానపద బాణీల్లో పాటలు కట్టి స్వయంగా పాడి గ్రామాలలోని ప్రజలను ఆకట్టుకునేది.
– వామపక్ష భావాలతో, స్త్రీల ఆధ్వర్యంలో మొదలైన పత్రిక ‘చైతన్య మానవి’ సంపాదకవర్గంలో ఈమె ఒకరు.

స్వరాజ్యం పాటల్లో ఒక ఉయ్యాలపాటలో కొంత భాగం..

వీరమరణం చెందిన ’మట్టారెడ్డి’, ’అనంతరెడ్డి’లను స్మరిస్తూ బతకమ్మ పాటశైలిలో ఇలా వివరించింది.

వీరిమట్టారెడ్డి ఉయ్యాలో
ధీర అనంతారెడ్డి ఉయ్యాలో
మీవంటి వీరులు ఉయ్యాలో
మా మధ్య నిలబడి ఉయ్యాలో
మాకు వెలుగులు చూపి ఉయ్యాలో
ఓర్వదీ ప్రభుత్వంబు ఉయ్యాలో
పాత సూర్యాపేట ఉయ్యాలో
పోరాటమును చూడు ఉయ్యాలో
ప్రజల బలమును జూసి ఉయ్యాలో
పారిపోయిరి వాళ్ళు ఉయ్యాలో
మన ప్రజల రాజ్యమును
పొంది తీరాలమ్మ ఉయ్యాలో

ప్రముఖుల నివాళి..
– మల్లు స్వరాజ్యం ఆకస్మిక మృతికి పలువురు సంతాపం తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటానికి తుంగతుర్తి గడ్డ అందించిన చైతన్యంతో ఎదిగిన పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం అన్నారు. ప్రజల కోసం కృషి చేసిన స్వరాజ్యం జీవన గమనం రేపటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

– నమ్మిన సిద్ధాంతం కోసం కడవరకూ పోరాటం చేసిన గొప్ప ధీశాలి మల్లు స్వరాజ్యం అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.

– పసితనంలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి తుది శ్వాస వరకూ ప్రజల పక్షాన పోరాటం చేసిన వీరనారి మల్లు స్వరాజ్యం అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు.

– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌తోపాటు పలువురు నివాళి అర్పించారు.

Also Read: ‘ఎన్టీఆర్ – చరణ్’ల పై రాజమౌళి క్రేజీ కామెంట్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular