విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ఇక టీడీపీ రంగంలోకి: ఆందోళన ఉధృతం చేయాలని బాబు పిలుపు..

విశాఖ ప్రైవేటీకరణపై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీలు అండగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. పార్టీ నాయకులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తు్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న […]

Written By: NARESH, Updated On : February 16, 2021 2:01 pm
Follow us on

విశాఖ ప్రైవేటీకరణపై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. విశాఖ ఉక్కు ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వీరికి ప్రతిపక్ష పార్టీలు అండగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. పార్టీ నాయకులు ఆందోళనలు, ధర్నాలు నిర్వహిస్తు్నారు. ఇందులో భాగంగా ఈ నెల 18న రాష్ట్రవ్యాప్త ఆందోళనకు సిద్ధమవుతున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు.

మరోవైపు చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ తనపై ఉన్న కేసులను మాఫీ చేయించుకునేందుకు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవడం లేదన్నారు. ఒకవైపు ఉక్కు కర్మాగారం కోసం ఆందోళనలు జరుగుతుంటే సీఎం స్పందించకపోవడం శోచనీయమన్నారు. జగన్ పోస్కో సంస్థతో లోపాయికారి ఒప్పందం చేసుకోవడం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనన్నారు. కర్మాగారంలోని మిగులు భూములను కాజేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలను వ్యతిరేకించడం లేదన్నారు.

విశాఖ ఉక్కు ప్రైవేటీకీరణకు వ్యతిరేకంగా టీడీపీ నేత పల్లా శ్రీనివాస్ అమరణ నిరాహార దీక్ష చేపట్టారు. అయితే పోలీసులు ఈయన దీక్షను భగ్నం చేశారు. పల్లా శ్రీనివాస్ కు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు వెళ్లాల్సి ఉంది. కానీ దీక్ష భగ్నం చేయడంతో ఆయన పర్యటించడం లేదు. అయితే ఈనెల 18న రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఇక ఉక్కు ప్రైవేటీకరణ ఆపేందుకు ముందుగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు బాబు ప్లాన్ వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ కోసం తమ పదవులకు రాజీనామా చేయడానికి వెనుకాడే ప్రసక్తే లేదని సూచించినట్లు సమాచారం. ఏదేమైనా టీడీపీ ఆధ్వర్యంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు ఆందోళన ఉధృతం చేయాలని టీడీపీ భావిస్తోందట.