CM KCR Delhi Protest: వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేసీఆర్ మరో ముందడుగు వేశారు. కేంద్రం కచ్చితంగా తెలంగాణ ధాన్యం కొనాల్సిందే అంటూ ఈరోజు ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో నిరసన కార్యక్రమం చేపట్టారు. వడ్ల కొనుగోలు రాజకీయంలో తనదే పైచేయి కావాలని మొదటినుంచి ప్రయత్నిస్తున్న కేసీఆర్ ఆ మేరకు అడుగులు కూడా వేస్తున్నారు. అయితే ఇప్పటివరకూ చేసిన ధర్నాలు ఒకెత్తయితే.. ఇప్పుడు ఢిల్లీలో చేపట్టిన ధర్నా మరో ఎత్తు అని చెప్పాలి.
ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో మాత్రమే నిరసనలు తెలిపారు. ఇది జాతీయ మీడియాలో పెద్దగా హైలెట్ కాలేదు. కానీ ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో ఒక రాష్ట్ర సీఎం ధర్నా చేస్తున్నారంటే ఖచ్చితంగా జాతీయ మీడియాలో సెంటర్ ఆఫ్ హైలెట్ గా నిలుస్తుంది. పైగా ఈ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాల జాతీయ నేత కూడా రావడం కలిసి వచ్చే అంశం.
అయితే ఇలాంటి నిరసన కార్యక్రమాలకు బిజెపి కేంద్ర ప్రభుత్వం అంత ఈజీగా లొంగదు. ఇప్పటికే మనం దేశవ్యాప్తంగా జరిగిన చాలా నిరసన కార్యక్రమాలను చూశాం. ఆ నిరసన కార్యక్రమాల్లో రైతులు, ఇతర ప్రజలు ఉండటం వల్లే కొద్దో గొప్పో మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కానీ ఇప్పుడు ఫక్తు రాజకీయ నేత ఆయిన కెసిఆర్ చేస్తున్న ఈ నిరసన కార్యక్రమంపై కేంద్ర పెద్దగా స్పందించే అవకాశాలు లేవు.
Also Read: భద్రాద్రికి రోడ్డు మార్గంలో వెళ్లిన గవర్నర్.. సర్కారు కావాలనే హెలికాప్టర్ సమకూర్చలేదా?
పైగా ఈ వల్ల రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. తెలంగాణలో ఓటు బ్యాంకు ఎక్కువగా రైతులదే కావడంతో.. ఇప్పుడు కేసీఆర్ వడ్లను కొనడం లేదు అనే భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది. మొదటి నుంచి తాను అనుకుంటున్నానని చెబుతున్న కేసీఆర్ ఇప్పుడు సడన్ గా కేంద్రం కొనడం లేదని చెబితే ఎవరు నమ్ముతారు.
ఇక తెలంగాణలో బిజెపి కూడా రైతుదీక్ష చేపడుతోంది. కేసీఆర్ నిరసన దీక్షకు కౌంటర్ గా బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ రాష్ట్ర నేతలు ఈ దీక్షలో పాల్గొన్నారు. మొత్తంగా చూసుకుంటే కేసీఆర్ చేస్తున్న హడావిడి పై కేంద్రం ఏ మాత్రం సీరియస్ గా లేదని అర్థమవుతోంది. తెలంగాణ పార్టీ నేతలతోనే కౌంటర్ వేస్తోంది.