Mallanna Sagar Reservoir: తెలంగాణ ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల కోసం నిధులన్ని ఖర్చు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుతో కాలువలను అనుసంధానం చేస్తూ సాగునీటి ప్రాజెక్టులు నింపేందుకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు కూడా నీటిని ఎత్తిపోసే విధంగా మరో ప్రాజెక్టుకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో సాగునీటి కష్టాలు తీరుతాయని రైతాంగం ఎదురుచూస్తోంది.
మల్లన్నసాగర్ కోసం సీఎం కేసీఆర్ ఎంతో శ్రమించారు. రైతాంగం ఆశలు తీర్చేందుకు గాను జలవనరులను సిద్ధం చేసే పనిలో భాగంగానే ఆయన విరామం లేకుండా పని చేశారు. కాళేశ్వరం నుంచి రైతులకు సాగునీటికి గాను మల్లన్న సాగర్ కు నీటిని మళ్లించడం ఓ మహత్తర కార్యక్రమంగా అభివర్ణిస్తున్నారు. దీనిపై ఆర్థిక మంత్రి హరీష్ రావు సీఎం సేవలను కొనియాడుతున్నారు.
Also Read: వైఎస్ వివేకా కేసు: చిక్కుల్లో కడప ఎంపీ అవినాష్ రెడ్డి?
దీంతో తెలంగాణ రైతాంగం రెండు పంటలు పండించుకుని హాయిగా జీవించాలన్నదే కేసీఆర్ సంకల్పమని చెబుతున్నారు. దీనికి గాను ఇంకా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ముందుకు నడుస్తామని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సాగునీరు అవసరాలు తీర్చేందుకు ఉద్యమంలా చేపడుతున్నట్లు వివరించారు.
మల్లన్నసాగర్ రూ.6 వేల కోట్లతో నిర్మించారు అత్యాధునిక సాంకేతికతతోప్రాజెక్టును రూపుదిద్దినట్లు తెలుస్తోంది. 50 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును రెండు జిల్లాలకు ఆయకట్లుకు సాగునీరందించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణ రైతుల కల నెరవేర్చే క్రమంలో ప్రభుత్వం ముందుకు రావడం ఆహ్వానించదగినదే.
రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రంలో సాగునీటి తిప్పలు ఇకపై ఉండకుండా చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో కరువు ఉండొద్దని చెబుతున్నారు.
Also Read: బడ్జెట్ లేదు.. గిడ్జెట్ లేదు.. 94 వేల కోట్లు ఏమైపోయాయబ్బా?