CM KCR: తెలంగాణలో కేసీఆర్ మరోమారు స్థానం మార్చుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఆయన నియోజకవర్గాలు మారిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఉద్యమంలో కరీంనగర్ నుంచి పోటీ చేసి అనూహ్యంగా విజయం సాధించారు. మరోమారు ఎంఎస్ఆర్ చేసిన సవాలుతో కూడా రాజీనామా చేసి ఉప ఎన్నికలో బ్రహ్మాండమైన మెజార్టీ సాధించి తెలంగాణ తడాఖా ఏంటో చూపించారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా వచ్చే ఎన్నికల్లో మరోసారి నియోజకవర్గం మార్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఉత్తర తెలంగాణలో పార్టీ బాగున్నా దక్షిణ తెలంగాణలో కాస్త అటు ఇటుగా ఉంది. అందుకే దక్షిణ తెలంగాణలో గులాబీ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఆయన ఈసారి మునుగోడును ఎంచుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ భవితవ్యం కోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తారు. ఎంతటి త్యాగాలైనా చేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే తెలంగాణలో పార్టీని విస్తరించే క్రమంలో కేసీఆర్ మరిన్ని జాగ్రత్తలు తీసుకునేందుకు కూడా వెనుకాడరని తెలుస్తోంది.
Also Read: KCR Vs BJP: కేంద్రంతో రణమా.. శరణమా! కేసీఆర్ ప్లాన్ ఏంటి?
తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం లేదని కేసీఆర్ నమ్ముతున్నారు. కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో కేసీఆర్ కు ప్రత్యామ్నాయం బీజేపీ అని తేలిపోతోంది. అందుకే ఆయన బీజేపీని టార్గెట్ చేసుకుంటున్నట్లు సమాచారం. మరోవైపు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తుంటే ఆయన ఎంపీ స్థానం కోసం చూడాలి కానీ ఎమ్మెల్యే స్తానం నుంచి పోటీకి సిద్ధపడ్డారంటే ఆయనకు జాతీయ రాజకీయాలపై పెద్దగా ఆసక్తి లేదు. మరి ఎందుకు మూడో కూటమి అంటూ తిరుగుతున్నారనే ప్రశ్న కూడా వస్తోంది.

బీజేపీని గద్దె దించాలని కంకణం కట్టుకున్న కేసీఆర్ ప్రస్తుతం ఎందుకు మౌనంగా ఉన్నారనే వాదన కూడా వస్తోంది. టీఆర్ఎస్ కు ఎదురుగా కాంగ్రెస్ నిలవలేదు. బీజేపీకి అంత సత్తా ఉందని నేతలు చెబుతున్నా అంత సీనుందా అని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతోనే తమకు ఎదురులేదనే ఉద్దేశంతో వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేననే ధీమాలో ఉన్నారు. అందుకే పూర్తిస్థాయి అయిదేళ్లు పరిపాలించాకే ఎన్నికలకు వెళతామనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల నోళ్లకు తాళం పడినట్లు అవుతోంది.
Also Read: YCP vs BJP: జగన్ పై జగడానికే బీజేపీ రెడీనా?
Recommended Video: