KCR- ADR Report: దేశంలోనే అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో తెలంగాణ సీఏం కేసీఆర్ అగ్రస్థానంలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్(ఎన్‌ఈడబ్ల్యూ) ప్రజాప్రతినిధుల నేర చరితపై నివేదిక విడుదల చేసింది. ఇది ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా, చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో నివేదిక..
రాష్ట్రపతి ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఈ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఎమ్మెల్యేలు, లోక్ సభ ఎంపీలు మాత్రమే ఓటర్లు. ఈనెల 18న ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. అయితే ప్రతీ ఎన్నికల సందర్భంలో చేసినట్లే ఇప్పుడు కూడా నేతల నేరచరితను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్∙వాచ్ (ఎన్‌ఈడబ్ల్యూ) సంస్థలు వెల్లడించాయి. ప్రజా ప్రతినిధులుగా ఎన్నికై, రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేయబోయే వారిపై నమోదైన కేసులుకు సంబంధించి ఏడీఆర్, ఎన్‌ఈడబ్ల్యూ తాజాగా రిపోర్టులో ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది. ఏడీఆర్, నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో 37 తీవ్రమైన సెక్షన్లు కలిగి ఉన్నాయని వెల్లడించారు. కేరళ ఎంపీ డీఎన్ కురియకోస్ 204 కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్ కేసులతో (తమిళనాడు) డీఎంకే ఎంపీ ఎస్.కతిరవన్ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ఆజంఖాన్ 87 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.
Also Read: TS Rains Effect: భారీవర్షాలు.. తెలంగాణ సీఎం కేసీఆర్ మరో సంచలన నిర్ణయం
ఎన్నికల అఫిడవిట్ అధ్యయనం..
ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ రెండు వాచ్ బాడీలు మొత్తం సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల 4,809 అఫిడవిట్‌లలో 4759 అధ్యయనం చేశాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్న మొత్తం 4,759 మంది ఎంపీలు/ఎమ్మెల్యేలలో 477 మంది అంటే 10% మాత్రమే మహిళలు ప్రతినిధులు ఉండడం గమనార్హం. ఏడీఆర్ రిపోర్టు ప్రకారం తెలంగాణ సీఎం కేసీఆర్ పై పెండింగ్ లో ఉన్న కేసుల్లో.. 13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన అభియోగాలు, ప్రభుత్వ ఉద్యోగి విధులు అడ్డుకోవడం, గాయపరచడానికి ప్రయత్నించడానికి సంబంధించిన 4 అభియోగాలు, హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు, ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించినా స్నాచింగ్స నేరాలు 3 ఉన్నాయి.

అంతేకాదు మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు జీవిత ఖైదు లేదా ఇతర కారాగార శిక్షతో శిక్షార్హమైన నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నించినందుకు శిక్షకు సంబంధించిన 2 ఆరోపణలు, ప్రజా దుష్ప్రచారానికి దారితీసే స్టేట్‌మెంట్‌లకు సంబంధించిన ఆరోపణలు, ధ్వంసం చేయడం లేదా తరలించడం మొదలైన చట్టవ్యతిరేక చర్యలకు సంబంధించిన 2 కేసులున్నాయి. ఇంకా సంకల్పం, స్వీకరించే అధికారం లేదా విలువైన భద్రత మోసపూరిత రద్దు, విధ్వంసం మొదలైన వాటికి సంబంధించిన 2 కేసులు, జాతీయ సమగ్రతకు విఘాతం కలిగించే వాదనలు సంబందించి ఒక కేసు ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో చాలా వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైనవే అధికం.
Also Read:Unique Blood Group: ప్రపంచంలో రేర్ బడ్ల్ గ్రూప్ ఉన్న మన దేశంలోని వ్యక్తి గుర్తింపు..