https://oktelugu.com/

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సీఎం కాన్వాయ్

మంత్రులు, ముఖ్యమంత్రులు, వీఐపీల కాన్వాయ్ లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటాయి. మరీ వీటికి ట్రాఫిక్ చలాన్లు వీటికి వర్తించవా? అనే ప్రశ్న సామాన్యుల్లో మెదలుతూ ఉంటుంది. అయితే ట్రాఫిక్ రూల్స్ ఎవరీకైనా ఒకటేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తాజాగా నిరూపించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ కు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. ఒకటే కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు చలాన్లు విధించడం చర్చనీయాంశంగా మారింది. ఓవర్ స్పీడు కారణంగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 3, 2020 3:51 pm
    Follow us on

    KCR Convoy

    మంత్రులు, ముఖ్యమంత్రులు, వీఐపీల కాన్వాయ్ లు రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకుపోతుంటాయి. మరీ వీటికి ట్రాఫిక్ చలాన్లు వీటికి వర్తించవా? అనే ప్రశ్న సామాన్యుల్లో మెదలుతూ ఉంటుంది. అయితే ట్రాఫిక్ రూల్స్ ఎవరీకైనా ఒకటేనని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు తాజాగా నిరూపించారు. ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించిన సీఎం కేసీఆర్ కాన్వాయ్ కు ట్రాఫిక్ పోలీసులు చలాన్లు విధించారు. ఒకటే కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు చలాన్లు విధించడం చర్చనీయాంశంగా మారింది. ఓవర్ స్పీడు కారణంగా నాలుగు చలాన్లు విధించినట్లు సమాచారం. ట్రాఫిక్స్ రూల్స్ ప్రజలందరికీ సమామేనని.. ఎవరూ కూడా అతీతులుకారని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ అయిన ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చలాన్లు చెల్లించాల్సిందే అంటున్నారు.

    సీఎం కాన్వాయ్ ఓవర్ స్పీడ్ కారణంగా నాలుగు సార్లు చల్లాన్లు విధించారు. హైదరాబాద్‌లో రెండు సార్లు, సైబరాబాద్‌లో ఒకటి, సూర్యాపేట జిల్లాలో మరోసారి చలాన్లు విధించారు. కిందటేడాది అక్టోబర్ 16న కోదాడ సమీపంలోని శ్రీరంగాపురంలో సీఎం కాన్వాయ్ కి తొలిసారి జరిమానా విధించారు. కాగా ఈ మొత్తం మూడుసార్లు చలాన్లు విధించారు. 2020 ఏప్రిల్ 15న మాదాపూర్ పరిధిలో రెండోసారి.. ఏప్రిల్ 29న టోలిచౌకి పరిధిలో మూడోసారి, జూన్ 1న ట్యాంక్‌బండ్ పరిధిలో నాలుగోసారి చలాన్లు విధించారు.

    సీఎం కాన్వాయ్ కు ట్రాఫిక్ చలాన్లు విధించారని మీడియాలో రావడంతో ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. మొత్తం నాలుగు చలాన్లు క్లియర్ చేసినట్లు సమాచారం. జూన్ 1న విధించిన ఫెనాల్టీ కలిపి మొత్తం రూ. 4,140లను సీఎంవో చెల్లించినట్లు తెలుస్తోంది. దీంతో సీఎం కాన్వాయ్ కు సంబంధించిన చలాన్లు ఏవీ పెండింగ్లో లేవని అధికారులు చెబుతోన్నారు.