ప్రైవేటు ఆస్పత్రులకు దోచిపెడుతున్నారా జగన్?

అసలే కరోనా కల్లోలం.. మహమ్మారి విస్తరించింది. ఇలాంటి టైం ఎవరైనా ఏం చేస్తారు? పేదలకు వైద్యం సహాయం అందించేలా చొరవ తీసుకుంటారు. ఉచితంగా మందులు, చికిత్సలు చేయాలని చూస్తారు. కానీ మన ఘనత వహించిన ఏపీలోని జగన్ సర్కార్ మాత్రం ప్రైవేటు ఆస్పత్రులను మరింత దోచుకోమనేలా చికిత్స ఫీజులు పెంచడం అందరినీ నెవ్వెరపరుస్తోంది. కరోనా కల్లోలంతో రూపాయి సంపాదన లేక అల్లాడుతున్న రోగులను ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే దోచుకుంటున్నాయి. కనీసం 2.50 లక్షలు కడితే కానీ ఏపీలోని […]

Written By: NARESH, Updated On : April 30, 2021 9:57 am
Follow us on

అసలే కరోనా కల్లోలం.. మహమ్మారి విస్తరించింది. ఇలాంటి టైం ఎవరైనా ఏం చేస్తారు? పేదలకు వైద్యం సహాయం అందించేలా చొరవ తీసుకుంటారు. ఉచితంగా మందులు, చికిత్సలు చేయాలని చూస్తారు. కానీ మన ఘనత వహించిన ఏపీలోని జగన్ సర్కార్ మాత్రం ప్రైవేటు ఆస్పత్రులను మరింత దోచుకోమనేలా చికిత్స ఫీజులు పెంచడం అందరినీ నెవ్వెరపరుస్తోంది.

కరోనా కల్లోలంతో రూపాయి సంపాదన లేక అల్లాడుతున్న రోగులను ప్రైవేటు ఆస్పత్రులు ఇప్పటికే దోచుకుంటున్నాయి. కనీసం 2.50 లక్షలు కడితే కానీ ఏపీలోని ప్రైవేటు ఆస్పత్రులు బెడ్ ఇవ్వడం లేదు. ఇంతటి దారుణ దోపిడీని అరికట్టాల్సింది పోయి కోవిడ్ చికిత్సలకు రేట్లు పెంచి జగన్ సర్కార్ మరింత దోపిడీని ప్రోత్సహించినట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపనలు వెల్లువెత్తుతున్నాయి.

ఏపీలో కరోనా తీవ్రతపై సమీక్షించిన సీఎం జగన్ తాజాగా ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా వైద్య సేవలకు ఫీజులను పెంచుతున్నట్టు ప్రకటించారు. సాధారణ సేవలకు రూ.3250, తీవ్ర అనారోగ్యం పాలైన వారి నుంచి రూ.10380 వసూలు చేసేలా ప్రభుత్వం గతంలో ధరలు నిర్ణయించింది.

ఇప్పుడు ఆ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయించింది. ప్రస్తుతం తీవ్ర అనారోగ్యం పాలైన వారికి అందించే సేవలకు ఫీజు రూ.16వేలకు పెంచారు. అంటే ఏకంగా 6 వేలు పెంచడం చూసి రోగులు సైతం షాక్ అవుతున్నారు. ఈ నిర్ణయంపై రోగులపై భారం పడనుంది. నిజానికి ఈ ధరలను ఏవీ ప్రైవేటు ఆస్పత్రులు పాటించవు. లక్షల్లో వసూలు చేస్తాయి. కానీ ప్రభుత్వమే పెంచడంతో ఇప్పుడు ఆ ధరలు రెండు మూడు రెట్లు పెంచి మరింత దోపిడీకి ప్రైవేటు ఆస్పత్రులు స్కెచ్ గీసే ప్రమాదం ఉంది.

సాధారణంగా ప్రభుత్వాలు ఈ కరోనా కల్లోలం వేళ పేదలు, మధ్యతరగతి వారికి ఉచిత లేదా సాధారణ రేట్లతో వైద్యం అందించేలా చర్యలు చేపడుతాయి. ఇలాంటి మహమ్మారి వేళ లాభాపేక్ష లేకుండా చికిత్సలు చేయాలని కోరుతాయి. ప్రభుత్వమే వైద్యసేవలను టేకప్ చేసి అందరికీ ఉచితంగా వైద్యం అందించిన దేశాలు కూడా ఉన్నాయి.

కానీ మన జగన్ సర్కార్ మాత్రం కరోనా వేళ ప్రైవేటు ఆస్పత్రులకు రేట్లు పెంచుతూ తీసుకున్న నిర్ణయం విమర్శలకు తావిస్తోంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. పేదల నడ్డి విరుస్తారా? ప్రైవేటు ఆస్పత్రులకు దోచి పెడుతారా? జగన్ అని అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.