New Rajya Sabha Member From AP: ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ సభ్యుల కోసం జగన్ ఎవరి వైపు మొగ్గు చూపుతారో తెలియడం లేదు. జూన్ లో నలుగురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేస్తుండటంతో వారి సీట్లలో ఎవరిని నియమించాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. రాజ్యసభ్యులుగా ఉన్న సురేష్ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, విజయసాయిరెడ్డి ల పదవీ కాలం జూన్ 21న ముగియనుండటంతో వారి స్థానంలో కొత్త వారిని నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దీంతో వారి ఎంపికకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి కి పదవి ఖరారు కావడంతో మిగతా మూడు స్థానాలపై ఆలోచిస్తున్నారు. గతంలో ముఖేష్ అంబానీ సహచరుడు పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చిన జగన్ ఈమారు అదానీ భార్యకు రాజ్యసభ పదవి ఇవ్వాలని బావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో స్థానంలో అదానీ సతీమణి ప్రీతి అదానీకి రాజ్యసభ పదవి ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర
మూడో స్థానాన్ని మైనార్టీ వర్గానికి కేటాయించాలని చూస్తున్నట్లు సమాచారం. దీంతో ఆ స్థానం కోసం సినీనటుడు అలీకి ఇస్తారని ప్రచారం సాగుతున్నా సాంకేతిక కారణాల వల్ల అలీకి రాజ్యసభ దక్కకపోవచ్చని తెలుస్తోంది. దీంతో అలీని వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలీకి కూడా సముచిత స్థానం ఇవ్వాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇక నాలుగో స్థానం గురించే చర్చ సాగుతోంది. పార్టీలో సీనియర్ నేత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఇవ్వాలని చూస్తున్నా ఇదివరకే విజయసాయిరెడ్డికి ఇవ్వడంతో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు ఉండటంతో మరో నేతను ఎంచుకోనున్నట్లు సమాచారం. దీనికి బొత్స సత్యనారాయణకు ఎంచుకోనున్నట్లు తెలుస్తోంది. దీంతో జగన్ అన్ని విషయాలను క్రోడీకరించుకుని రాజ్యసభ సభ్యుల ఎంపిక చేయనున్నట్లు చెబుతున్నారు.
Also Read: తెలంగాణలో రైతులను ఆకట్టుకునేందుకు బీజేపీ వ్యూహం ఫలిస్తుందా?