Jagan- Early Elections: ఏపీలో ముందస్తు ఎన్నికల ముచ్చట చాన్నాళ్లుగా వినిపిస్తోంది. అదిగో ఇదిగో అంటూ నేతలు లెక్కలు కడుతున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. జగన్ ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఇటువంటి రుమార్లే వస్తుంటాయి. కేంద్ర పెద్దల వద్ద అనుమతి కోసమే ఆయన ఢిల్లీ వెళ్లారంటూ ప్రచారం జరుగుతుంది. తీరా ఆయన ఢిల్లీ నుంచి వచ్చి తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. గత ఏడాదిన్నరగా జరుగుతున్నది ఇదే. అయితే బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీని రద్దు చేసి ముందస్తుకు వెళతారంటూ తాజాగా ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే జగన్ సంకేతాలిచ్చారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో జరిగిన వర్క్ షాపులో దీనిపై క్లారిటీ ఇచ్చారు. అటు ఎమ్మెల్యేలకు ప్రత్యేక టాస్క్ కూడా ఇచ్చారు. బాగా పనిచేయకుంటే తప్పిస్తానని కూడా హెచ్చరించారు.
Cyber Towers Hyderabad: రాళ్ళ గుట్టల్లో ఐటీ నగరం వెలిసింది: హైదరాబాద్ గతినే మార్చేసింది
విపక్ష నేత చంద్రబాబు సైతం ముందస్తుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ వచ్చారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ముందస్తు ఆలోచనలతోనే పొత్తుకు శ్రీకారం చుట్టారు. అటు కుమారుడు లోకేష్ పాదయాత్రకు ప్లాన్ చేశారు. సీఎం జగన్ చర్యలను సునిశితంగా గమనిస్తూ వచ్చిన చంద్రబాబు ముందస్తు తప్పదని బలంగా నమ్ముతున్నారు. లోకేష్ పాదయాత్రకు సమాంతరంగా తాను కూడా అన్ని జిల్లాలను చుట్టేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా బాధ్యులతో సమావేశమయ్యారు. ఎటువంటి ఇబ్బందులు లేని నియోజకవర్గాల్లో అభ్యర్థులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కొన్ని నియోజకవర్గాలనుమాత్రం పొత్తుల దృష్ట్యా పెండింగ్ లో పెట్టారు.
అయితే జగన్ వర్క్ షాపులో ముందస్తుపై కామెంట్స్ చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల వ్యవధి ఉందన్నారు. ఓ 30 మంది ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని గుర్తుచేస్తూ.. మారేందుకు ఆరు నెలల వ్యవధి ఇచ్చారు. అప్పటికీ మారకుంటే మార్చేస్తానని హెచ్చరించారు. దీంతో ముందస్తు ముచ్చట లేదని తేల్చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలకు వెళతామని సంకేతాలిచ్చారు. దీంతో ఇన్నాళ్లూ జరిగిన ముందస్తు ఎన్నికల ప్రచారానికి శుభం కార్డు పడినట్టే. అయితే వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నాయి. తిరుగుబాట్లు కలవరపెడుతున్నాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంది. ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ముందస్తుకు వెళ్లడం కరెక్ట్ అన్న నిర్ణయానికి జగన్ వచ్చారు. కానీ అటు కేంద్రం పెద్దగా సుముఖత చూపకపోవడం, సరైన కారణాలు చూపి ముందస్తుకు వెళ్లకుంటే ప్రజలకు రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళ్లే అవకాశముందని భావించి జగన్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది.
Also Read: Bandla Ganesh- KCR: కేసీఆర్‌పై సడెన్‌గా బండ్ల గణేశ్‌కు జ్ఞానోదయం ఎలా అయ్యింది!