కోర్టుల చుట్టు తిరుగుతున్న సివిల్ సర్వీస్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సర్వీస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో నోటీసులు అందుకుని కోర్టుల్లో హాజరు వేయించుకుని విధులకు వెళ్తున్నారు. తాజాగా చిరంజివి చౌదరి, గిరిజా శంకర్ అనే సివిల్ సర్వీస్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది. కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని సూచించింది. దీంతో వారు రోజంతా కోర్టులోనే ఉండాల్సి వచ్చింది. ఇదేమీ పెద్ద శిక్ష కాకపోయినా వారి సర్వీసులో పదోన్నతులకు అడ్డంకిగా మారనుంది. ప్రభుత్వం సూచించే విధులు […]

Written By: Raghava Rao Gara, Updated On : July 7, 2021 4:13 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో సివిల్ సర్వీస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. కోర్టు ధిక్కరణ కేసుల్లో నోటీసులు అందుకుని కోర్టుల్లో హాజరు వేయించుకుని విధులకు వెళ్తున్నారు. తాజాగా చిరంజివి చౌదరి, గిరిజా శంకర్ అనే సివిల్ సర్వీస్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది. కోర్టు సమయం ముగిసే వరకు కోర్టులోనే ఉండాలని సూచించింది. దీంతో వారు రోజంతా కోర్టులోనే ఉండాల్సి వచ్చింది. ఇదేమీ పెద్ద శిక్ష కాకపోయినా వారి సర్వీసులో పదోన్నతులకు అడ్డంకిగా మారనుంది. ప్రభుత్వం సూచించే విధులు నిర్వహించకపోవడంతో వారు శిక్షార్హులవుతున్నారు.

కోర్టుకు చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా హైకోర్టుకు హాజరయ్యారు. కానీ ఆయన వచ్చింది వీరిని పరామర్శించడానికి కాదు. ఆయన కూడా ఓ కేసులో అఫిడవిట్ సమర్పించేందుకు సమయం అడిగి అనుమతి దొరకడంతో తిరిగి వెళ్లారు. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ సునీల్ కుమార్ లపై కూడా ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. వారంతా కోర్టుల చుట్టు తిరగడమే కాదు భవిష్యత్ లో కూడా ఇబ్బందులు తప్పేలా లేవు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేకమంది సివిల్ సర్వీస్ అధికారులపై కేసులు నమోదయ్యాయి. ప్రభుత్వం చెప్పినట్లు చేస్తుండడంతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చట్టాలు, రాజ్యాంగాన్ని పట్టించుకోకపోవడంతో ప్రజలు వేసిన వ్యాజ్యాలపై కోర్టుల చుట్టు తిరుగుతున్నారు. కొన్న కేసుల్లో హైకోర్టు అక్షింతలు సైతం వేస్తోంది. దీంతో అధికారుల్లో భయం నెలకొంటోంది. చేస్తే ఓ లెక్క చేయకపోతే మరో లెక్క ఎలా విధులు నిర్వహించేది అని మథనపడుతున్నారు. ప్రభుత్వ మన్ననల కోసం కొందరు చట్టాన్ని ఉల్లంఘిస్తున్న మాట నిజమేనని తెలుస్తోంది.

వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పలువురు అధికారులు కేసుల్లో ఇరుక్కున్నట్లు తెలిసిందే. కొంతమంది జైలు పాలయ్యారు. ఇప్పుడు జగన్ చెప్పిందే వేదం అన్నట్లుగా తలూపడంతో అధికారులు కేసుల పాలవుతున్నారు. ప్రభుత్వ వ్యవహారాలపై వచ్చే ప్రభుత్వం విచారణ చేపడితే ఇంకా పలువురు అధికారులు జైలుకెళ్లక తప్పదని నిపుణులు చెబుతున్నారు.