https://oktelugu.com/

సింహాచలం ధర్మకర్త మార్పు వెనుక క్రైస్తవ కోణం

రాత్రికి రాత్రే సింహాచలం ధర్మకర్త అశోకగజపతి రాజు గారిని తొలగించి మాన్సాస్ ట్రస్టును ఆయన అన్న కూతురు సంచితకు కట్టబెట్టడం వెనుక కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం కూడా ఉంది. కాకపోతే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెలుగుదేశం నేతలు, అటు రాజకుటుంబీకులు కూడా జంకుతున్నారు. అసలు విషయం ఏంటంటే ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆయన మరణానంతరం తన తమ్ముడు అశోకగజపతి […]

Written By: , Updated On : March 6, 2020 / 07:23 PM IST
Follow us on

రాత్రికి రాత్రే సింహాచలం ధర్మకర్త అశోకగజపతి రాజు గారిని తొలగించి మాన్సాస్ ట్రస్టును ఆయన అన్న కూతురు సంచితకు కట్టబెట్టడం వెనుక కేవలం రాజకీయ కోణం మాత్రమే కాదు. మత కోణం, భూమాఫియా ప్రమేయం కూడా ఉంది. కాకపోతే ఈవిషయం ధైర్యంగా చెప్పడానికి తెలుగుదేశం నేతలు, అటు రాజకుటుంబీకులు కూడా జంకుతున్నారు.

అసలు విషయం ఏంటంటే ఆనందగజపతిరాజు గారు బతికి ఉన్నప్పుడే ఆయన తన భార్య ఉమాగజపతిరాజుకు విడాకులు ఇచ్చారు. ఆయన మరణానంతరం తన తమ్ముడు అశోకగజపతి రాజుగారు తరతరాలుగా వస్తున్న సంప్రదాయం ప్రకారం ధర్మకర్త అయ్యారు. రాజవంశానికి ఎవరు పెద్దదిక్కు లేదా వారసుడో వారే ధర్మకర్తగా ప్రభుత్వం నియమించడం ఇప్పటివరకు వస్తున్న ఆచారం. దానిని తుంగలో తొక్కి ఆయన బతికుండగానే తొలగించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రహస్య జీవోలతో సంచైతను నియమించింది.

ఆనందగజపతిరాజు గారి నుంచి విడాకులుమ్ తీసుకున్న కేరళ రాజకుమారి ఉమాగజపతిరాజు తరువాత రమేష్ శర్మ అనే దర్శకుడిని ద్వితీయ వివాహం చేసుకున్నారు. తన ఇద్దరు ఆడ పిల్లలతో సహా ఆయనతో ఉంటున్నారు. ఆయన క్రైస్తవుడు. వీరి పేజ్ 3కుటుంబం చాలా రిచ్, పోష్. రమేష్ శర్మ తను గాంధీ మీద, ఆయన అహింసా సిద్ధాంతం మీద సందేశాత్మక చిత్రానికి ఐక్యరాజ్యసమితి శాంతి బహుమతి పొందారు. తరచుగా విదేశాల్లో చర్చిలను, పాస్టర్లను దర్శించుకుంటారు. అలాంటి వ్యక్తి పెంపకంలో పెరిగిన సంచైత ఇప్పుడు సింహాచలం ధర్మకర్త!

వీరి కుటుంబం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటుంది. ఇక సంచైత గజపతిరాజు సన అనే ఎన్జీవో నిర్వహిస్తూ స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా కేజ్రీవాల్, మేధాపాట్కర్ లాంటి వివిధ నేతలతో కలిసి బాలికలకు మరుగుదొడ్లు, తాగునీరు అనే అంశాల్లో పనిచేసి బాగా పేరుపొందారు. సన ఎన్జీవో సంస్థ కూడా ఆనంద్ శర్మ, ఉమాగజపతిరాజు, సంచైతా గజపతిరాజు అనే ముగ్గురి ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తోంది.

కన్నా లక్ష్మీనారాయణ గారి సమక్షంలో ఎన్నికల ముందు భాజపాలో చేరారు తప్ప ఆమె పార్టీ కార్యక్రమాల్లో ఏనాడూ చురుకుగా లేరు. సుజనాచౌదరి భాజపా పార్టీలో ఎందుకు చేరారో ఈమె కూడా అందుకే చేరినట్లు కనబడుతోంది. మాన్సాస్ ట్రస్టు ఆధీనంలో సింహాచలంతో సహా 108 గుడులు, పధ్నాలుగు వేల ఎకరాల భూములు ఉన్నాయి. విశాఖపట్నం రాజధాని అని ప్రకటించిన నేపథ్యంలో దీని వెనుక ఉన్న కారణాలు మనం తేలిగ్గా ఊహించవచ్చు