Chevireddy Bhaskar Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కు నచ్చని పత్రికలు రెండు ఒకటి ఈనాడు, రెండు ఆంధ్రజ్యోతి. అలాంటిది ఆంధ్రజ్యోతిలో ఈ మధ్య ఫుల్ పేజీ ప్రకటనలు వస్తున్నాయి. దీంతో అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రజ్యోతిని వీళ్లు కొన్నారా? లేక వీళ్లనే ఆంధ్రజ్యోతి కొన్నదా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల ప్రకటనలు ఆంధ్రజ్యోతిలో రావడం గమనార్హం. అసలే శత్రువు పత్రిక అయినా అందులో జగన్ కు శుభాకాంక్షలు ఫుల్ పేజీ యాడ్ రావడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉగాది సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ కు శుభాకాంక్షలు చెబుతూ ఆంధ్రజ్యోతిలో ఫుల్ పేజీ ప్రకటన ఇవ్వడంతో అందరిలో అనుమానాలు వస్తున్నాయి. వ్యక్తిగత హోదాలో ఫుల్ పేజీ యాడ్ ఇవ్వడంతో చెవిరెడ్డి వేమూరికి దగ్గరవుతున్నారా? లేక వీరే ఆంధ్రజ్యోతిని తమ దారికి తెచ్చుకుంటున్నారా అనే సందేహాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ సైతం అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో ప్రకటనల జోరు కొనసాగుతోందనే వాదనలు వస్తున్నాయి.
ఈ క్రమంలో రాష్ట్రంలో పరిస్థితి మరోలా మారేలా ఉందని తెలుస్తోంది. చెవిరెడ్డి చేత ప్రకటనలు ఇప్పించేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. లేకపోతే మొదటి సారి ఇచ్చినప్పుడే వద్దనే వారు కానీ ఇప్పుడు వరుసగా ప్రకటనలు ఇస్తుంటే ఆంధ్రజ్యోతికి వైసీపీకి మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. చెవిరెడ్డి కోట్లు ఖర్చు పెట్టి ఇలా ప్రకటనలు ఇవ్వడంలో ఆంతర్యమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి.

మరోవైపు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి చెవిరెడ్డి సరుకులు పంపిస్తూ ఉంటారు. వాటిని కూడా ఆంధ్రజ్యోతి ప్రచారం చేస్తోంది. దీంతో చెవిరెడ్డికి వేమూరికి మధ్య సంబంధాలు బలపడినట్లు తెలుస్తోంది. అందుకే ఆంధ్రజ్యోతిలో ప్రకటనలు ఇస్తూ వారికి సాయం చేస్తుంటారని చెబుతున్నారు. వైసీపీకి కూడా మరో పత్రిక సాయం ఉండాలనే ఉద్దేశంతోనే ఆంధ్రజ్యోతితో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆర్కేతో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పలువురు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు.
[…] Amaravati Capital Issue: ఆది నుంచి అమరావతి రాజధానిపై సుముఖంగా లేని వైసీపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు మడత పేచీ వేస్తోంది. అమరావతి రైతులు సుదీర్ఘ కాలం పోరాటబాట పట్టినా పట్టించుకోలేదు. విపక్ష నేతల డిమాండ్లను, విన్నపాలను సైతం పరిగణలోకి తీసుకోలేదు. ప్రజల్లో వ్యతిరేకత భావన వస్తున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతూ వస్తొంది. చివరకు న్యాయస్థానం తప్పు పట్టి నిర్ణీత ఆరు నెలల వ్యవధిలో అమరావతి రాజధాని ప్రాంతాన్ని అభివ్రద్ధి చేయాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను సైతం ప్రభుత్వం బేఖాతరు చేసింది. […]
[…] AP Cabinet Reshuffle 2022: దెబ్బ కొట్టి ఆయింట్ మెంట్ రాయడం అనే సామెత మీకు గుర్తుండే ఉంటుంది కదా.. ఇప్పుడు వైసీపీలోని మంత్రుల పరిస్థితిని చూస్తుంటే ఇదే గుర్తుకు వస్తోంది. ఎందుకంటే త్వరలోనే ఇప్పుడున్న మంత్రుల్లో చాలా వరకు మాజీలు కాబోతున్నారు. ఈ విషయాన్ని జగన్ స్వయంగా ప్రకటించారు. అయితే వారికి పార్టీలోని కీలక బాధ్యతలు అప్పటించనున్నారు జగన్. […]