https://oktelugu.com/

చీఫ్ జస్టిస్ కు జగన్‌ లేఖపై విచారణ బెంచ్‌ మార్పు.. తీర్పుపై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తగులుతున్న ఎదురుదెబ్బలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ తీర్పుల వెనుక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారంటూ ఏకంగా సీజేకు లేఖ రాశారు. ఆ లేఖ కాస్త దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. బార్‌‌ అసోసియేషన్లు ఆగ్రహం చెందాయి. అంతేకాదు.. ఆ లేఖను బయటపెట్టడంతో జగన్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ పిటిషన్లు వేశారు. అయితే.. వీటిపై త్వరలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుబోతోంది. గతంలో ఈ కేసు విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల బెంచ్‌ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 27, 2020 / 10:03 AM IST
    Follow us on

    ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో తగులుతున్న ఎదురుదెబ్బలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహంతో ఊగిపోయారు. ఈ తీర్పుల వెనుక సుప్రీంకోర్టు జడ్జి ఉన్నారంటూ ఏకంగా సీజేకు లేఖ రాశారు. ఆ లేఖ కాస్త దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. బార్‌‌ అసోసియేషన్లు ఆగ్రహం చెందాయి. అంతేకాదు.. ఆ లేఖను బయటపెట్టడంతో జగన్‌ను బర్తరఫ్‌ చేయాలంటూ పిటిషన్లు వేశారు. అయితే.. వీటిపై త్వరలో సుప్రీంకోర్టులో విచారణ జరుగుబోతోంది. గతంలో ఈ కేసు విచారణ జరుపుతున్న ముగ్గురు సభ్యుల బెంచ్‌ నుంచి జస్టిస్‌ యూయూ లలిత్‌ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ఈ కేసు విచారణ కోసం కొత్త బెంచ్‌ను, కొత్త తేదీని ఖరారు చేశారు.

    Also Read: తిరుపతి సీటుపై జగన్‌ స్పెషల్‌ ఫోకస్‌

    సుప్రీం జడ్జికి వ్యతిరేకంగా చీఫ్‌ జస్టిస్‌కు జగన్‌ రాసిన లేఖ, ఆ తర్వాత ఆయన సలహాదారు అజయ్ కల్లం దాన్ని బయటపెట్టిన నేపథ్యంలో వీరిద్దరిపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు మణి, సునీల్‌ నారాయణ్‌ సింగ్‌ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణకు నియమించిన బెంచ్‌లో ఉన్న జస్టిస్ యూయూ లలిత్‌.. గతంలో ఈ పిటిషన్లో భాగస్వాములుగా ఉన్న వారి తరఫున వాదించినందున, ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ ఈసారి జస్టిస్‌ సంజయ్‌ కిషన్ కౌల్‌, జస్టిస్‌ దినేష్ మహేశ్వరి, జస్టిస్‌ హృషికేష్‌ రాయ్‌లతో కూడిన కొత్త ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.

    తాజాగా… ముగ్గురు సభ్యుల సుప్రీం కోర్టు ధర్మాసనం డిసెంబర్‌‌ 1న ఈ కోర్టు ధిక్కరణ కేసును విచారణ చేపట్టబోతున్నారు. దీంతో ఈ కేసులో ఏం జరగబోతోందననే ఉత్కంఠ నెలకొంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై లేఖ రాయడం ద్వారా జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆయనను సీఎం పదవి నుంచి తొలగించాలని పిటిషనర్లు కోరుతున్నారు.

    Also Read: నారాలోకేష్ కు ఏపీ పోలీసుల హెచ్చరికలు

    ఎన్నో వివాదాలకు దారితీసిన ఈ అంశంపై సుప్రీం కోర్టు ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందా అని యావత్‌ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. గతంలో ఎన్నడూ ఇలాంటి పరిణామం (సుప్రీం ఛీఫ్‌ జస్టిస్‌కు ముఖ్యమంత్రి లేఖ) చోటు చేసుకోకపోవడంతో ఈ కేసులో సుప్రీం ఆదేశాలు భవిష్యత్‌ పిటిషన్లకూ మార్గదర్శనం చేయబోతున్నాయి. మరోవైపు.. అటు ఏపీ ప్రభుత్వంలోనూ.. ఏపీ సీఎంలోనూ ఆ టెన్షన్‌ కనిపిస్తోంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్