
సాధారణంగా వయస్సు మీద పడితే కొందరు చాదస్తపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా గత కొన్ని రోజులుగా మాట్లాడుతున్న మాటలను పరిశీలిస్తే ఆయనకు కూడా చాదస్తం పెరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతలకే బాబు మాట్లాడుతున్న మాటలు అర్థం కావడం లేదు. రాజధాని వ్యవహారంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు పార్టీ నేతలను గందరగోళంలో పడేస్తున్నాయి.
Also Read : కేసీఆర్ కు జగన్ సపోర్టు చేస్తారా? చేయరా?
కొందరు నేతలైతే బాబు మాట్లాడుతున్న మాటలు కనీసం ఆయనకైనా అర్థమవుతున్నాయా…? అని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారని సమాచారం. కరోనా వల్ల ఆన్ లైన్ సమావేశాలకు ప్రాధాన్యతనిస్తున్న చంద్రబాబు త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ఎంపీలకు జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని పార్లమెంట్ లో ఎండగట్టాలని… కేంద్రం, రాష్ట్రం పరిధిలోకి రాజధాని అంశం రాకపోతే పార్లమెంట్ కే రాజధానిపై నిర్ణయం తీసుకునే అధికారం ఉంటుందని పేర్కొన్నారు.
కేంద్రం ఆర్టికల్ 248ను అనుసరించి రాజధానిని సమస్యను పరిష్కరించేలా చూడాలని చంద్రబాబు తన పార్టీ నేతలకు కీలక సూచనలు చేశారు. అయితే అమరావతిని రాజధానిగా ఎంపిక చేసిన సమయంలో బాబుకు గుర్తుకు రాని కేంద్రం ఇప్పుడు గుర్తుకు వస్తూ ఉండటం గమనార్హం. కేంద్రం ఇప్పటికే రాజధాని తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసినా చంద్రబాబు చేస్తున్న ఈ తరహా వ్యాఖ్యలు పార్టీ నేతలను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
నిజానికి కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ విజయవాడ గుంటూరు మధ్య సారవంతమైన భూములు ఉన్న నేపథ్యంలో అక్కడ రాజధానిని ఏర్పాటు చేయడానికి అంగీకారం తెలపలేదు. చంద్రబాబు మాత్రం తమ పార్టీ నేతలు ముందుగానే భూములు కొనుగోలు చేసిన అమరావతిలోనే రాజధాని ఉండబోతుందని చెప్పారు. రాజధాని ఎంపిక అధికారం పార్లమెంటుకు ఉంటుందని కొత్త పలుకులు పలుకుతున్న చంద్రబాబుకు తాను రాజధానిని ఏర్పాటు చేసిన సమయంలో పార్లమెంట్ ఎందుకు గుర్తుకు రాలేదో ఆయనే సమాధానం చెప్పాలి.
Also Read : వైసీపీ మద్దతు కోసం బీజేపీ విన్నపాలు… జగన్ ఏం చేస్తారో…?
Comments are closed.