Chandrababu: ఏపీలో చంద్రబాబు అధికారంలో లేకున్నా నిత్య శ్రామికుడిలా వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న కసితో తపన పడుతున్నట్లు తెలుస్తోంది. నిత్యం ప్రజల మధ్య ఉండేందుకు ఏదో ఒక ఆందోళన రూపంలో మీడియాలో కనిపిస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన మీడియాకు దూరంగా ఉన్నా.. ఈ మధ్య తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతిపక్షంగా ఆయన చేస్తున్న ఆందోళనలతో ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని కార్యక్రమాలు బాబుకు బెడిసికొట్డడంతో ఆయన ప్లాన్ బీ అమలు చేయడానికి సన్నద్ధమవుతున్నారట.. అంటే అధికారంలో ఉన్న వైసీపీని ప్రజలకు దూరం చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కలిసి రావడం లేదు. దీంతో ప్రభుత్వ పథకాలపై ఆయన దృష్టి సారించారు. వచ్చే ఎన్నికల్లో ఎలాంటి పథకాలతో ప్రజల్లోకి వెళ్లాలి..? ప్రజలు వేటికి ఆకర్షితులవుతున్నారు..? అనే దానిపై సీరియస్ గా స్టడీ చేస్తున్నట్లు సమాచారం.
ఇటీవల చంద్రబాబు స్టడికల్ గా బీజీగా మారిపోయారు. దేశంలో ప్రాంతీయ పార్టీలను ప్రజలు ఏవిధంగా ఆదరిస్తున్నాదనే దానిపై తీవ్రంగా అధ్యయనం చేస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు ఎలాంటి పథకాలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చాయి…? ఆ తరువాత వాటిని ఎలా అమలు చేశాయి..? అన్నదానిపై దృష్టి పెడుతున్నారట. గత సంవత్సరం జరిగిన ఎన్నికల్లో డీఎంకే భారీ విజయం సాధించింది. పదేళ్ల తరువాత ఇక్కడి ప్రజలు ఆ పార్టీని ఆదరించారు. అయితే అందుకు పార్టీ కొన్ని ప్రత్యేక పథకాలు హామీలివ్వడంతోనే డీఎంకే విజయం సాధించింది. ఆ హామీలు ఎలా ఉన్నాయి…? అనే దానిపై చంద్రబాబు ఆరా తీస్తున్నట్లు సమాచారం.
ఢిల్లీలో కేజ్రీవాల్ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చారు. కేంద్రంలో బీజేపీతో ఆయన వీరోచిత పోరాటం చేస్తూనే ప్రజలకు అవసరమైన పథకాలు ప్రవేశపెట్టి వారి మన్ననలను పొందారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్ టికెట్ల లాంటి పథకాలు తీసుకొచ్చారు. దీంతో ఢిల్లీ వాసులు కేజ్రీవాల్ కు హ్యాట్రిక్ కు అవకాశం ఇచ్చారు. ఇక తెలంగాణలో కేసీఆర్ ప్రవేశపెట్టిన దళిత బంధుపై కూడా ఆరా తీస్తున్నారు. ఈ స్కీం ద్వారా ప్రయోజనాలెంత..? ఆ తరువాత దీనిని ఎలా అమలు చేయాలి..? అనే దానిపై స్టడీ చేస్తున్నారు.
ఏపీలో ఇప్పటికే అధికార వైసీపీ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆకట్టుకుంటోంది. అయితే గతంలో టీడీపీ హయాంలో ప్రవేశపెట్టిన్న కొన్ని ప్రభుత్వ స్కీమ్స్ వైసీపీ రిజెక్ట్ చేసింది. ఆ తరువాత కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. అయితే కొన్నింటిపై వ్యతిరేకత రావడంతో చంద్రబాబు దానిని క్యాష్ చేసుకొని ఇతర ప్రభుత్వాలు అమలు చేసేవాటిపై దృష్టి పెడుతున్నారు. కొందరు టీడీపీ నాయకులు ఆయా రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పథకాలు, వాటి అమలు తీరుపై నివేదికలు తయారు చేసి వాటిని చంద్రబాబుకు అప్పగిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని చంద్రబాబు ఇప్పటినుంచే వివిధ వ్యూహాలను రచిస్తున్నారు. ఇందులో భాగంగా ఓ వైపు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే మరోవైపు ప్రజలను ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చంద్రబాబు గతంలో కొన్ని పథకాలు ప్రవేశపెట్టినా వాటి అమలులో తాత్సారం జరిగింది. ఇక మిగతా రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి, వాటి అమలుపై సీఎంలు దృష్టి సారిస్తారు. కానీ ఇక్కడ పథకాలు ఆడంబరంగా ప్రవేశపెట్టినా వాటిని గ్రౌండ్ వర్క్ చేయడంలో మాత్రం పట్టించుకోరు. దీంతో అవి ఫెయిల్ అవుతున్నాయని కొందరు అంటున్నారు. అయితే ఈసారి చంద్రబాబు అలా కాకుండా ప్లాన్ బీ అమలు చేసి పకడ్బందీగా సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో బాబు ప్లాన్ అమలు అవుతుందా..? చూడాలి.