Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- Chandrababu: చంద్రబాబు రాజకీయ సన్యాసం.. పవన్ కళ్యాణ్ కు లైన్ క్లియర్..

Pawan Kalyan- Chandrababu: చంద్రబాబు రాజకీయ సన్యాసం.. పవన్ కళ్యాణ్ కు లైన్ క్లియర్..

Pawan Kalyan- Chandrababu: చంద్రబాబు నోటి నుంచి ఎప్పుడూ రాజకీయాలకు దూరమవుతానన్న మాట రాలేదు. ఆయనకు ఓపిక, సహనం ఎక్కువ. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలరు. 2004 తరువాత పార్టీ రెండుసార్లు ఓటమి చవిచూసినా.. పదుల సంఖ్యలో నాయకులు పార్టీని వీడి చంద్రబాబుపై ఆరోపణలు చేసినా నిబ్బరంగా ఉండేవారు. తన సీనియార్టీని రంగరించి మరీ 2014 ఎన్నికల్లో మరోసారి పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. కానీ అటువంటి చంద్రబాబే ఈసారి రాజకీయ సన్యాసం సంకేతాలివ్వడం సొంత పార్టీ శ్రేణుల్లోనే చర్చనీయాంశమైంది. ధైర్యం లేక ఇటువంటి ప్రకటన చేశారా? లేక వ్యూహాత్మకమా? అంటూ చర్చించుకుంటున్నారు. ప్రజల్లో సెంటిమెంట్ అస్త్రం రగిల్చేందుకు అయితే ఓకే కానీ.. మరే ఇతర కారణాలు ఉన్నాయా? అంటూ అన్వేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో జనసేనాని పవన్ వారి మధ్య చర్చకు కారణమవుతున్నారు.

Pawan Kalyan- Chandrababu
Pawan Kalyan- Chandrababu

వాస్తవానికి వైసీపీ సర్కారు దూకుడుకు చంద్రబాబు నుంచి కిందిస్థాయి టీడీపీ నాయకుడు వరకూ తట్టుకోలేకపోతున్నారు. ప్రశ్నిస్తే కేసులు, ఎదురుదిరిగితే దాడులు ఎదురవుతున్నాయి. సాక్షాత్ చంద్రబాబుకే ముప్పుతిప్పలు పెట్టారు. అటువంటిది మిగతా నాయకులు వారికో లేక్క. అందుకే టీడీపీలో పదవులు వెలగబెట్టిన వారందరికీ ఒకటి, రెండు రోజులు కటకటాలకు పంపించారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో ఒకరకమైన అభద్రతాభావం ఎదురైంది.ధైర్యం తగ్గింది. ఇటువంటి తరుణంలో ప్రభుత్వ బాధితులకు పవన్ ఒక ఆశాదీపంలా కనిపించారు. ఒక్క తెలుగుదేశం, జనసేనయే కాదు. ప్రభుత్వం నుంచి బాధించబడిన వర్గాలన్నీ ఇప్పుడు పవన్ వైపే చూస్తున్నాయి. పవన్ దూకుడుతో ఆయన గొడుగు కిందకు చేరుతున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీలోని చాలావర్గాలు చంద్రబాబు కంటే పవనే కరెక్ట్ అని భావిస్తున్నాయి.

తాజాగా చంద్రబాబు రాజకీయ సన్యాసం ప్రకటనతో పవన్ కు లైన్ క్లీయర్ అయ్యిందని అటు జనసేన, ఇటు టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే పవన్ ఒక చాన్స్ స్లోగన్ ప్రజల్లోకి వెళ్లింది. చంద్రబాబును చూశాం.. జగన్ ను చూశాం.. పవన్ కు ఒక చాన్సిస్తే పోలే అంటూ ప్రజలు కూడా ఒక డిసైడ్ కు వచ్చారు. సరిగ్గా ఇటువంటి సమయంలో చంద్రబాబు ప్రకటన ఇవ్వడాన్ని ప్రజలు స్వాగతిస్తూనే.. అల్ట్రనేషన్ గా పవన్ ఉన్నాడు కదా అని గుర్తుచేస్తున్నారు.

Pawan Kalyan- Chandrababu
Pawan Kalyan- Chandrababu

వాస్తవానికి చంద్రబాబు సీనియర్, పాలనాదక్షుడు. అందులో నో డౌట్. కానీ ఆయన రాష్ట్రంలో మెజార్టీ ప్రజల అభిమానాన్ని చూరగొనలేకపోయారు. 2014లో అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా అవకాశమిచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయారు. చంద్రబాబు అంటే ప్రజలకు ఒకరకమైన భావం ఏర్పడేలా ఆయన కొన్ని పాలక నిర్ణయాలు తీసుకున్నారు. వాటి ప్రభావం ఇప్పటికీ ఆయనపై చెరగడం లేదు. అలాగని టీడీపీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయమంటే ఎవరూ కనిపించడం లేదు. ఈ తరుణంలో పవనే టీడీపీ శ్రేణులకు దిక్కుగా మారారు. చంద్రబాబు కానీ పక్కకు తప్పుకుంటే మాత్రం అది పవన్ కు ప్లస్ పాయింట్ తప్ప.. మరే ఇతరులకు కాదని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular