Chandrababu Delhi Tour: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పొత్తు కోసం తపిస్తున్నారు. పొత్తులతోనే పార్టీని గట్టెక్కించాలని చూస్తున్నారు. ఇందుకోసం కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఆయన బీజేపీతో ఉండాలని భావిస్తున్నారు. కేంద్రంలో మరోమారు బీజేపీ అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతుండటంతో బీజేపీతోనే జట్టు కట్టాలని భావిస్తున్నారు. అదే సమయంలో వైసీపీని అధికారానికి దూరం చేయాలని తలపోస్తున్నారు.ఇవన్నీ జరగాలంటే బీజేపీ సాయం కావాలని చూస్తున్నారు.

రాష్ర్టంలో శాంతిభద్రతలు సరిగా ఉండటం లేదని, డీజీపీని రీకాల్ చేయాలని బీజేపీ నేతలను కోరాలని ప్రణాళిక రచించుకుంటున్నారు. ప్రధాని, హోం మంత్రులను కలవాలని ప్లాన్ చేసుకుంటున్నారు. ఈనెల 31న పార్లమెంట్ సమావేశాలు కానుండటంతో అందరు ఢిల్లీలోనే ఉంటారని వారిని కలవడం సులభమని భావించి వారి అపాయింట్ మెంట్ కోరాలని రెడీ అవుతున్నారు.
గతంలోనే టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడుల గురించి ఫిర్యాదు చేయాలని ఢిల్లీ వెళ్లినా అందరి అపాయింట్ మెంట్ దొరకలేదు. అందుకే రాష్ర్టపతిని కలిసి పరిస్థితిని వివరించారు. కానీ ఈసారి అలా కాకుండా వైసీపీ నేతలను టార్గెట్ చేసుకుని వారిపై చర్యలు తీసుకోవాల్సిందేనని గట్టిగా చెప్పేందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Chandrababu Naidu: చంద్రబాబులో నిజంగానే మార్పు వచ్చిందా?
చంద్రబాబు గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రంతో విభేదించి ఒంటరైపోయారు. ఫలితంగా అధికారానికి దూరమైపోయారు. ఈ మధ్య బీజేపీతో సత్సంబంధాలు కొనసాగుతున్న క్రమంలో బీజేపీతోనే పొత్తు పెట్టుకోవాలని చూస్తున్నారు. పైగా బీజేపీకి కూడా ప్రాంతీయ పార్టీల అవసరం ఉన్నందున టీడీపీకి మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో చంద్రబాబుకు లైన్ క్లియర్ అవుతుందా? లేదా? అనేది సందేహం.
రాబోయే రోజుల్లో ఉత్తరాదిలో మెజార్టీ రాకుండా దక్షిణాది ప్రాంతాలపైనే బీజేపీ ఆధారపడుతుందని తెలుస్తోంది. అందుకే ప్రాంతీయ పార్టీలను దగ్గర ఉంచుకోవాలని భావనలో అధిష్టానం భావిస్తోంది. ఇందుకోసమే వారికి అవసరమైన సాయం చేస్తూ వారిని భవిష్యత్ లో సాయం చేయాలని కోరినా ఆశ్చర్యపడనక్కర్లేదని తెలుస్తోంది. దీంతో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి తమ నేతలపై జరుగుతున్న దాడులపై వివరించనున్నట్లు సమాచారం.
Also Read: Chandrababu: చంద్రబాబు చాణక్యం.. టీడీపీ చేతిలోకి మరో అస్త్రం.. ఈ సారి విక్టరీ గ్యారెంటీ..!
[…] Venu Thottempudi: ఆరున్నర అడుగుల తెలుగు కుర్రాడు తొట్టెంపూడి వేణు… రావడంతోనే సక్సెస్ అందుకున్నారు. 1999లో విడుదలైన రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ స్వయంవరం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కొత్త హీరో అయినా… సపరేట్ మేనరిజంతో వేణు అలరించారు. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. స్వయంవరం సినిమాతో మరో తెలుగు అమ్మాయి లయ హీరోయిన్ గా పరిచయం అయ్యారు. […]