Chandrababu Naidu Birthday: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏడు పదులు దాటేశాడు. తాజాగా ఆయన 72వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. దేశ రాజకీయాల్లోని ఉద్దండ రాజకీయ నేతగా బాబు ఎదిగారు. ఇప్పుడు టైం బ్యాడ్ అయిపోయి సైలెంట్ అయ్యారు కానీ.. ఒకప్పుడు ఉమ్మడి ఏపీ సీఎంగా రాష్ట్రపతులను,ప్రధానులను డిసైడ్ చేసిన ఘనత మన ‘బాబు’ గారి సొంతం. చంద్రబాబు 40 ఇయర్స్ పైగా పాలిటిక్స్ లో ఉన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా చంద్రబాబు కు అంటిన మరకలు.. ఆయన సాధించిన..
-చంద్రబాబు బయోగ్రఫీ
నారా చంద్రబాబు నాయుడు 1950, ఏప్రిల్ 20న చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లె అనే చిన్న గ్రామంలో ఒక సామాన్య మధ్యతరగతి రైతు కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి ఎన్. ఖర్జూర నాయుడు వ్యవసాయదారుడు.. తల్లి గృహిణి. తన సొంత గ్రామంలో పాఠశాల లేకపోవడంతో రోజూ పొరుగున ఉన్న శేషాపురంకు నడుచుకుంటూ వెళ్లి ప్రాథమిక విద్య చదివాడు. అనంతరం చంద్రగిరి లోని జడ్పీ పాఠశాలలో చేరి 9వ తరగతి పూర్తి చేశాడు. ఉన్నత చదువులు కోసం తిరుపతి వెళ్లి అక్కడే 10వ తరగతి పూర్తి చేసి తర్వాత శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో 1972లో బీఏ చదివాడు. తర్వాత ఆర్థికశాస్త్రంలో పీజీ చేశాడు.
Also Read: Punjab: తెల్లారిన కూలీ బతుకులు.. గుడిసెలో ఏడుగురు సజీవదహనం..!
చంద్రబాబు ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగి ఉండేవాడు. తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించి రాజకీయాల్లోకి రావాలని అనుకున్నాడు. విద్యాభ్యాసం పూర్తికాకముందే తిరుపతికి సమీపంలో ఉన్న చంద్రగిరిలో విద్యార్థి నాయకుడిగా యువజన కాంగ్రెస్ లో చేరాడు. చదువుకునేటప్పుడే సెలవులు వచ్చినప్పుడు స్నేహితులను.. మరికొందరిని కూడగట్టుకొని గ్రామంలో సామాజిక సేవా కార్యక్రమాలతో పలువురి ప్రశంసలు అందుకున్నాడు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం ఎన్నికల్లో చంద్రబాబు ప్రతిభ చూపాడు. రాజకీయ వ్యూహ చతురత బయటపడింది. తర్వాత శాసనమండలి ఎన్నికల్లో పోటీచేయాలని నామినేషన్ వేసి వెనక్కి తగ్గాడు.
1978లో చంద్రగిరి శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి పోటీచేసి గెలుపొందాడు. ఎమ్మెల్యేగా గెలిచాడు. యువతకు 20శాతం సీట్లు కేటాయించడంతో అందులో చంద్రబాబు లక్కీగా సీటు సంపాదించి గెలిచాడు. మొదట రాష్ట్ర చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా పనిచేసి.. కొంతకాలం తర్వాత ఏపీ సీఎం టంగుటూరి అంజయ్య కేబినెట్ లో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ మంత్రిగా తన 28వ ఏటనే చిన్న వయసులో మంత్రి పదవి చేపట్టాడు.
సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాడు తెలుగు సినిమా అగ్ర నటుడు ఎన్టీఆర్ దృష్టిలో పడ్డాడు.1981 సెప్టెంబర్ 10న ఎన్టీఆర్ మూడో కుమార్తె నందమూరి భువనేశ్వరిని పెపెళ్లి చేసుకున్నాడు.1982 మార్చి 29న ఎన్టీఆర్ తెలుగుదేశాన్ని స్థాపించడంతో మొదట కాంగ్రెస్ లో ఉన్న చంద్రబాబు అనంతరం టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయాడు. అనంతరం టీడీపీలో చేరాడు. రాజకీయంగా ఎదిగి మామ ఎన్టీఆర్ పార్టీ తెలుగుదేశాన్ని కైవసం చేసుకొని బలమైన నేతగా ఎదిగారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ను పదవి నుంచి కూలదోసి.. ఎమ్మెల్యేలను లాక్కొని వెన్నుపోటు పొడిచారని చంద్రబాబుపై ఒక అపవాదు ఉంది.
ఇక చంద్రబాబు సీఎం అయ్యాక అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ గా ఎదిగారు. తన జీవితంలో అత్యధిక కాలం సీఎంగానో.. ప్రతిపక్ష నేతగానే ఉన్న నేత చంద్రబాబు మాత్రమే. హైదరాబాద్ ను ఐటీ సిటీగా.. అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేననడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇక రెండు సార్లు సీఎం అయ్యి ఆ తర్వాత రెండు దఫాలు ప్రతిపక్షంలో ఉండి… విడిపోయిన ఏపీకి తొలి సీఎం అయ్యారు. పార్టీ కోసం నిరంతరం శ్రమిస్తూ ఈ స్థాయికి టీడీపీని చేర్చాడు. విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతంతో చిక్కుల్లో పడ్డా తర్వాత స్టాండ్ తీసుకొని పొత్తులతో ఏపీ సీఎంగా ఎదిగారు. ఏపీ కొత్త రాష్ట్రాన్ని అప్పులతో నెట్టుకొచ్చారు. 2019లో ఓడిపోయి ప్రతిపక్షంలోకి వచ్చారు.
చంద్రబాబు జీవితంలో ఎన్నో మరకలు, ఎన్నో ఘనతలు ఉన్నాయి. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా అవన్నీ గుర్తు చేసుకుంటూనే ఉంటున్నారు పార్టీ శ్రేణులు.
Also Read:CM Jagan Chiranjeevi: సీఎం జగన్ డిమాండ్స్ కి నో చెప్పిన మెగాస్టార్ చిరంజీవి.
Recommended Videos