ముందు నుంచీ పంచాయతీ ఎన్నికలు నిర్వహించవద్దంటూ వైసీపీ గోలగోల చేసింది. అయినా కోర్టు ఉత్తర్వులతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్యలో ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కాకుండా పంచాయతీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీనికి వైసీపీ అభ్యంతరం చెబుతున్నా పట్టించుకోకుండా ముందుకు వెళ్లారు. అదే ఇప్పడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు కలిసి వచ్చినట్లుగా ఫీల్ అవుతున్నారు.
Also Read: గంటా రాజీనామా.. జనాన్ని సంతృప్తి పరచడానికే?
పంచాయతీ ఎన్నికలను ముందుకు తెచ్చి నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలుగుదేశం పార్టీ నెత్తిన పాలు పోశారు. వైసీపీ ఊహించినట్లే గ్రామాల్లో కక్షలు ప్రారంభమయ్యాయి. సర్పంచ్, వార్డు పదవుల కోసం గ్రూపులు గ్రూపులుగా విడిపోయారు. అధికార వైసీపీలో గ్రూపులు ఎక్కువగా మొదలయ్యాయి. చంద్రబాబు ఎన్నికలకు ముందు కోరుకున్నది కూడా ఇదే. ఇప్పటివరకూ జగన్ ప్రభుత్వంపై నిరసన తెలపడానికి కూడా భయపడిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తుండటంతో చంద్రబాబులో ఉత్సాహం రెట్టింపయింది.
బలవంతపు ఏకగ్రీవాలు అనేక చోట్ల జరిగినప్పటికీ అక్కడ టీడీపీ వర్గం మరింత పటిష్టమైందన్న అభిప్రాయం బాబుకు కనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నిత్యం వారితో మాట్లాడుతుండటం, వైసీపీ నేతలు దాడులు చేసిన నేతలతో నేరుగా ఫోన్ లో టచ్‌లోకి వెళుతుండటం వంటివి పార్టీ క్యాడర్‌లో ధైర్యాన్ని నింపాయని అనుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికలు, పార్టీ గుర్తులేని ఎన్నికలు అని వదిలేయకుండా చంద్రబాబు దీనికోసం అంతర్గత కమిటీలను సైతం నియమించారు.
Also Read: అరకులో ఘోర రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ లో విషాదం
న్యాయ సలహాలు, సహకారం ఉచితంగా ఇచ్చేందుకు ఇరవై నాలుగు గంటలు పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ లీగల్ సెల్‌ను అందుబాటులో ఉంచారు. కేంద్ర కార్యాలయానికి అందిన సమాచారం ప్రకారం అన్ని జిల్లాల్లో గ్రామాల వారీగా పార్టీ నేతలు రోడ్లపైకి వస్తున్నారన్న నివేదికలు చంద్రబాబులో ఆనందాన్ని నింపాయి. చంద్రబాబు కోరుకున్నదీ ఇదే. ఇరవై నెలలుగా జరగనది కేవలం ఇరవై రోజుల్లోనే పరిస్థితి మారిందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఆ కొట్లాటలు బాబు గారికి ఎంతో ఆనందాన్ని నింపుతున్నాయనట. పంచాయతీ ఎన్నికలు ఆయనలో మరింత జోష్‌ను పెంచుతున్నాయట.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్