Chandrababu: తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం ఎదురీదుతోంది. రాజకీయంగా వైసీపీని ఎదుర్కోవాలంటే బలం పెంచుకోవాల్సి ఉంది. దీంతో చంద్రబాబు పార్టీని బలోపేతం చేసే దిశగా ఆలోచిస్తున్నారు. ఇన్నాళ్లు బాబుకు మంచి జోష్ ఇచ్చిన నేతల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన వయసు కూడా పెరుగుతున్నందున నాయకత్వ మార్పు అనివార్యమని భావిస్తున్నారు. దీంతో చంద్రబాబులో అంతర్మథనం మొదలైంది. పార్టీని ఎలా గాడిలో పెట్టాలని భావిస్తున్నారు. దీని కోసం ఏం చర్యలు చేపట్టాలో అనే దానిపై ఆలోచిస్తున్నారు.

ఇటీవల కాలంలో చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా పొత్తుల గురించే అడుగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు ఉండాల్సిందే అని చెబుతుండటంతో జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీ భవితవ్యం దృష్ట్యా పొత్తులు ఉండాల్సిందేనని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వ్యూహాలు మారాల్సిందేనని సూచిస్తున్నారు. ఇది ఇబ్బందికరమైన విషయంగా పరిగణిస్తున్నారు. కానీ కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు నిర్ణయం తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.
Also Read: చంద్రబాబుతో పొత్తు.. అసలు పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏమిటీ?
పొత్తుల విషయంలో మరో డిమాండ్ కూడా తెరమీదకు వస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీలోకి ఆహ్వానించాలని అడుగుతున్నారు. దీంతో బాబు డైలమాలో పడుతున్నారు. ఎక్కడకెళ్లినా అవే డిమాండ్లు వస్తుండటంతో ఏమీ తేల్చుకోలేకపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు చూపెడుతూ ఆయనను పార్టీలోకి తీసుకు రావాలని కార్యకర్తలు బాబును ఇరకాటంలో పెడుతున్నారు. దీంతో చంద్రబాబులో సహనం నశిస్తోంది.
దీంతో చంద్రబాబులో పార్టీని ఎలా నడపాలనే దానిపై దృష్టి సారించారు. మరోవైపు వైసీపీ బలం కూడా పెరుగుతుండటంతో టీడీపీని కూడా పొజిషన్ లోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది. రాబోయే ఎన్నికల్లో పాటించాల్సిన విధానాలపై కసరత్తు చేస్తున్నారు. పొత్తులపై కూడా ఓ క్లారిటీ ఉండాలని చూస్తున్నారు. దీంతో జనసేనతో పొత్తు ఉంటుందా లేక కమ్యూనిస్టులను ఆశ్రయిస్తారా అనే దానిపై స్పష్టత రావడం లేదు. 2024 ఎన్నికల్లో బాబు అవలంబించబోయే విధానాలపై పార్టీ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది.
Also Read: పవన్ తో చంద్రబాబు కలిస్తే.. మరి బీజేపీ పరిస్థితేంటి?