భేటీ వెనుక ఉన్న బిగ్ బాస్ చంద్రబాబేనా?

ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎస్.ఇ.సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ విషయంలో తెర వెనుక ఉన్నది ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్.ఇ.సి నిమ్మగడ్డ ఒక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ రాజకీయ నాయకులతో హైదరాబాద్ లోని పార్క్ హాయత్ హోటల్లో ఈ నెల 13న ఉదయం సమావేశం అయిన దృశ్యాలు మీడియా ప్రసారం చేసింది. ఈ సమావేశం సారాంశం ఏంటి, సమావేశంలో ఏమి చర్చించారనే విషయం […]

Written By: Neelambaram, Updated On : June 24, 2020 11:42 am
Follow us on


ఎంపీ సుజనా చౌదరి, మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, ఎస్.ఇ.సి నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ విషయంలో తెర వెనుక ఉన్నది ఎవరనే విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎస్.ఇ.సి నిమ్మగడ్డ ఒక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఇద్దరు టీడీపీ రాజకీయ నాయకులతో హైదరాబాద్ లోని పార్క్ హాయత్ హోటల్లో ఈ నెల 13న ఉదయం సమావేశం అయిన దృశ్యాలు మీడియా ప్రసారం చేసింది. ఈ సమావేశం సారాంశం ఏంటి, సమావేశంలో ఏమి చర్చించారనే విషయం ఎప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

హైదరాబాద్ లో జరిగిన ఈ భేటీ వెనుక రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పేరు వినిపిస్తోంది. గతంలో టీడీపీ నేతలుగా ఉన్న ఇద్దరు బీజేపీ నేతలు చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు కావడంతో ఈ భేటి వెనుక చంద్రబాబు ఉన్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డను మళ్ళీ పదవిలో కూర్చోపెట్టేందుకు చేపట్టాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఈ సమావేశం జరిగినట్లు సమాచారం. ఈ విషయంలో కేంద్రంలోని కీలక వ్యక్తుల నుంచి వత్తిడి తేచ్చేందుకు సమావేశంలో చర్చించి ఉంటారని సమాచారం.

చమురు ధరలపై బాబు వైఖరి వెనుక రహస్యం..!

వైసీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ చేసిన పోస్టులో ఆసక్తి కరమైమ విషయాన్ని వెల్లడించారు. హోటల్ లో సమావేశమైన ముగ్గురు వెనుక ఉన్న బిగ్ బాస్ ఎవరనేది త్వరలో బయటకు వస్తుందని ఆయన పోస్ట్ చేశారు. చంద్రబాబు రాజకీయ వ్యూహంలో నిమ్మగడ్డ ఒక పావుగా మారారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో చోటు చేసుకుంటున్న సంఘటనలు అదే విధంగా ఉండటం విశేషం.

అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎస్.ఇ.సిగా కొనసాగించాలని హైకోర్టు కొద్దీ రోజుల కిందట తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టు స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రమేష్ కుమార్ ను ఎస్.ఇ.సిగా ప్రకటించలేదు. దీంతో నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా పదవి చేపట్టేందుకు ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కొద్దీ రోజుల కిందట గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలవనున్నట్లు వార్తలు వచ్చాయి. అదేవిధంగా కోర్టుధిక్కార కేసును హైకోర్టు దాఖలు చేస్తారనే వార్తలు వినిపించాయి.