Vote FoR Note ఓటుకు నోటు కేసు: రేవంత్ భవిష్యత్ కేసీఆర్ చేతిలో.. కీలక పరిణామం

తెలంగాణ సీఎం కేసీఆర్ డిఫెన్స్ లో పడిపోయాడు. ఇప్పుడు తన ప్రత్యర్థిని రక్షించాలా? శరణు కోరి వచ్చిన తన శిష్యుడిని బతికించాలా? అన్న సంశయంలో పడిపోయాడు. కేసీఆర్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైందట.. 2015లో ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇరుకున్నాడు. ఈ కేసులో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డితోపాటు మరో టీడీపీ ఎమ్మెల్యే అయిన సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ తదితరులు కూడా ఈ కేసులో […]

Written By: NARESH, Updated On : August 25, 2021 5:11 pm
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ డిఫెన్స్ లో పడిపోయాడు. ఇప్పుడు తన ప్రత్యర్థిని రక్షించాలా? శరణు కోరి వచ్చిన తన శిష్యుడిని బతికించాలా? అన్న సంశయంలో పడిపోయాడు. కేసీఆర్ కు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా పరిస్థితి తయారైందట..

2015లో ఓటుకు నోటు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇరుకున్నాడు. ఈ కేసులో అప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డితోపాటు మరో టీడీపీ ఎమ్మెల్యే అయిన సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ తదితరులు కూడా ఈ కేసులో ఇరుక్కున్నారు.

అయితే తదనంతర రాజకీయాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు అయిన రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్యలు చెరో దారి ఎంచుకున్నారు. రేవంత్ కాంగ్రెస్ లో చేరి పీసీసీ చీఫ్ కాగా.. సండ్ర వెంకటవీరయ్య మాత్రం ‘ఓటుకు నోటు’ కేసులో ఇరుక్కోవడంతో టీఆర్ఎస్ లో చేరి కేసుల నుంచి తాత్కాలికంగా ఉపశమనం పొందారు.

ఈ క్రమంలోనే సండ్ర వెంకటవీరయ్య ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఓటుకు నోటు కేసు నుంచి తన పేరు తొలగించాలని కోరుతూ తాజాగా సుప్రీంకోర్టుకు ఎక్కారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు స్టే విధించింది. తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ సమాధానం బట్టి సండ్ర పేరును తొలగించాలా? లేదా? అన్నది సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఈ పరిణామం పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వరంగా మారింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి పిటీషనే వేశాడు. అది సెప్టెంబర్ కు వాయిదా పడింది. సండ్ర కూడా ఇప్పుడు అదే పిటీషన్ తో దాఖలు చేశారు. ఆగస్టు 31లోపు కేసీఆర్ స్పందించి సండ్ర పేరు తొలగిస్తే అది రేవంత్ రెడ్డికి కూడా ఈ కేసు నుంచి ఉపశమనం కలిగించే వార్త అవుతుంది.

ప్రస్తుతం సండ్ర వెంకటవీరయ్యను తెలంగాణ సర్కార్ కనుక ఈ కేసునుంచి పేరు తొలగించడానికి సిద్ధపడితే అది నాడు ఆయనతోపాటు కేసులో ఉన్న రేవంత్ రెడ్డికి కూడా ఊరటనివ్వడం ఖాయం. రేవంత్ పేరును కూడా తొలగించాల్సిన పరిస్థితి తెలంగాణ సర్కార్ కు వస్తుంది. అది రేవంత్ కు గొప్ప ఊరటనిచ్చేదిగా మారుతుంది. దీంతో ఇప్పుడు సండ్ర, రేవంత్ రెడ్డి భవిష్యత్ కేసీఆర్ చేతిలో ఉందని చెప్పొచ్చు. కేసీఆర్ కనుక తన పార్టీలో చేరిన ఎమ్మెల్యే సండ్రకు మేలు చేసేలా చూస్తే అది రేవంత్ కు గొప్ప వరం అవుతుంది.