https://oktelugu.com/

స్థానిక రిజర్వేషన్లపై జగన్ కు భంగపాటు!

రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న పలు ఏకపక్ష నిర్ణయాల కారణంగా వరుసగా రాష్ట్ర హై కోర్ట్ లో ఎదురు దెబ్బలకే గురవుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి స్థానికులకు 75 శాతం రేజర్వేషన్లు కలిపిస్తూ తీసుకున్న చర్యపై కూడా భంగపాటు తప్పదా? అని అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయమై దాఖలైన పిటిషన్ ను స్వీకరిస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే అటువంటి అనుమానాలకు అవకాశం ఏర్పర్చుతున్నాయి. పరిశ్రమలు, ప్రభుత్వ – ప్రైవేట్- భాగస్వామ్య సంస్థలలో […]

Written By: , Updated On : May 7, 2020 / 10:46 AM IST
Follow us on


రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న పలు ఏకపక్ష నిర్ణయాల కారణంగా వరుసగా రాష్ట్ర హై కోర్ట్ లో ఎదురు దెబ్బలకే గురవుతున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి మరోసారి స్థానికులకు 75 శాతం రేజర్వేషన్లు కలిపిస్తూ తీసుకున్న చర్యపై కూడా భంగపాటు తప్పదా? అని అనుమానాలు కలుగుతున్నాయి.

ఈ విషయమై దాఖలైన పిటిషన్ ను స్వీకరిస్తూ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలే అటువంటి అనుమానాలకు అవకాశం ఏర్పర్చుతున్నాయి. పరిశ్రమలు, ప్రభుత్వ – ప్రైవేట్- భాగస్వామ్య సంస్థలలో స్థైకులకు 75 శాతం రిజర్వేషన్ సదుపాయం జగన్ ప్రభుత్వం కల్పించడం తెలిసిందే.

విశాఖలో భారీ ప్రమాదం…!

ఈ నిర్ణయం ఏ మేరకు చట్టబద్దత కలిగి ఉందొ చెప్పాలని ప్రభుత్వానికి నోటీసు జారీ చేస్తూ, ఇది రాజ్యాంగ విరుద్ధమని అంటూ మౌఖికంగా హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేయడం ప్రభుత్వానికి ఆందోళన కలిగించే విషయమే. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి నెలరోజుల సమయం ఇచ్చింది.

ఆ విధంగా రేజర్వేషన్లు కల్పించడంలో యాజమాన్యాలు విఫలమైతే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంటూ రాష్ట్రప్రభుత్వం గత ఆగస్టులో ‘ఏపీ ఎంప్లాయ్‌మెంట్‌ ఆఫ్‌ లోకల్‌ క్యాండిడేట్స్‌ ఇన్‌ ద ఇండస్ట్రీస్‌/ ఫ్యాక్టరీస్‌ యాక్ట్‌’ తీసుకొచ్చింది.

ఇందులోని 3, 8 సెక్షన్లను సవాల్‌ చేస్తూ విజయవాడకు చెందిన న్యాయవాది సీహెచ్‌ వరలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు.

ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

కనీసం 12 ఏళ్ల స్థానికత ఉన్న వారికే ఉద్యోగాలంటూ ముల్కీ నిబంధనల పేరుతో 1969లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఇదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని పేర్కొనడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేశారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం భారత రాజ్యాంగంలోని అధికరణ 16(2), (3)లకు విరుద్ధంగా ఉందని.. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారని వివరించారు.

ప్రభుత్వ న్యాయవాది సి.సుమన్‌ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంపై ఏమైనా అభ్యంతరాలుంటే పరిశ్రమల యాజమాన్యాలు కోర్టుకు రావచ్చని, పరిశ్రమలతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తి ఇలాంటి పిటిషన్‌ దాఖలు చేయడానికి వీల్లేదని తెలిపారు. అందువల్ల ఈ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు.

ఇందుకు పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది బదులిస్తూ చట్టాన్ని ఎవరైనా సవాల్‌ చేయవచ్చని, వ్యక్తిగతంగా బాధితులైన వారే సవాల్‌ చేయాలన్న నిబంధన ఎక్కడా లేదని పేర్కొన్నారు. ఆయన వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. పై ఆదేశాలిచ్చింది.