Car Colour: కారు కొనాలనేది చాల మంది కలగా ఏర్పరుచుకుంటారు. అయితే ఈ కలను కొంతమంది మాత్రమే నెరవేర్చుకుంటారు. కారు కొనాలనుకున్నప్పుడు ముఖ్యంగా డిజైన్, ఇంజిన్ తో పాటు స్పెషిఫికేషన్ ను ప్రధానంగా చూస్తారు. కానీ వీటి కంటే ముఖ్యంగా ఏ కలర్ కారు కొనాలనేది కూడా ఇంపార్టెంటే అని తెలుస్తోంది. కొంత మంది ఏ కంపెనీ కారు అయినా తమకు నచ్చిన కలర్లో ఉంటేనే కొనుగోలు చేస్తారు. ఆ కలర్ ఉన్న కారు ఏ కంపెనీది అయినా కొనేందుకు ముందుకు వస్తారు. మన దేశంలో ఎక్కువ మంది ఓ కలర్ కారును ఇష్టపడుతున్నారని తెలుస్తోంది. వినియోగదారులకు అనుగుణంగానే కంపెనీలు సైతం ఉత్పత్తిని ప్రారంభించాయని సమాచారం. ఇంతకీ ఏ కలర్ కారు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారంటే?
ఏదైనా వస్తువు కొనుగోలు చేసేటప్పుడు ఇండియన్స్ ఎక్కువగా తమకు కావాల్సినవిధంగా ఉండాలని చూస్తారు. ముఖ్యంగా తమకు నచ్చిన కలర్ లో ఉండాలని పట్టుబడుతారు. వస్తువులు మాత్రమే కాకుండా కార్ల విషయంలో వినియోగదారుల అభిప్రాయం ఖచ్చితంగా ఉంటుందని ఓ సర్వేలో తేలింది. ఇందులో భాగంగానే తమకు కావాల్సిన కారు.. నచ్చిన కలర్లో ఉండాలని అనుకుంటున్నారు. వాటలో ఎక్కువగా బ్లాక్ ను కోరుకుంటున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది.
ఇండియన్ పీపుల్స్ లగ్జరీ, ఎస్ యూవీ కార్లకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. లగ్జరీ కార్లు కొనుటప్పుడు కలర్ కూడా నచ్చిన విధంగా ఉండేలా చూసుకుంటున్నారు. లగ్జరీ కార్లు కొనేవారు ఎక్కువగా బ్లాక్ లో ఉంటే ఇష్టపడుతున్నారు. ఆ తరువాత బ్లూ కలర్ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. గతంలో ఖరీదైన కార్లు కొనుగోలు చేయాలనుకునేవారు వైట్ కలర్లో ఉంటే ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ తాజాగా చేసిన సర్వేలో బ్లాక్ కలర్లో ఉంటే బెటరని భావిస్తున్నారు.
లగ్జరీ కార్లతో పాటు ఎస్ యూవీలకు ప్రాధాన్యత పెరుగుతోంది. ఎస్ యూవీ కార్లు కొనాలనుకునేవారు ఎక్కువగా బ్లాక్, గ్రే వంటి ఆక్రోమాటిక్ కలర్స్ నుంచి కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు. ఈ కార్లు కావాలనుకునేవారు సిల్వర్, వైట్, గ్రే కలర్ ను ఎక్కువగా కోరుకుంటున్నారు. అయితే మొత్తంగా ఈ మోడల్ కార్లు బ్లూ కార్లకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు సైతం నీలం, ఎరుపు రంగులకు భిన్నంగా ఉండే కలర్ కార్లను మార్కట్లోకి తీసుకొస్తున్నాయి. అత్యంత తక్కువగా కోరుకునే కలర్ గోల్డ్. ఈ కారు చాలారేర్ గా ఉత్పత్తి అవుతుంది.