Nara-Nandamuri : అదేదో సినిమాలో చిరు ” “జపం జపం కొంగ జపం. తపం తపం దొంగ తపం” అని పాడుతూ ఉంటాడు. రీల్ లో అయితే చిరు పాడాడు గాని.. రియల్ లో అయితే బాబు ఈ పాటను దశాబ్దాలుగా పాడుతూనే ఉన్నాడు. ఆ పాటకు నందమూరి వంశీయులు నర్తిస్తూనే ఉన్నారు. బాబు కు ఊపు ఆగదు. వారికి అలుపు రాదు.. ఇక్కడ దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడుకు కానీ, ఆయన తనయుడి కి కానీ అతిగా ప్రాధాన్యమివ్వడం నందమూరి వంశానికి ఎప్పుడూ కలిసి రాలేదు. వెన్ను పోటు తో మొదలుపెడితే నారా చేతిలో నందమూరి ఫ్యామిలీ పరాభవాలను, అవమానాలను పొందడమే కానీ అంతకుమించిన విశేషాలు పెద్దగా ఉండదు.. కొంతలో కొంత నందమూరి బాలకృష్ణ కు నారా కుటుంబంతో వియ్యం ఉంది. ఆయన హిందూపురం ఎమ్మెల్యేగా కూడా కొనసాగుతున్నారు.

ఎన్టీ రామారావు కు బాబు వెన్నుపోటు పొడవడం, ఆ పరిస్థితుల్లో ఆయన కుంగిపోయి, కొంతకాలానికి ప్రాణాలు కూడా కోల్పోయారు. బాబు తనకు చేసిన ద్రోహం గురించి పలు సందర్భాల్లో వాపోయారు.. గొడ్డు కన్నా హీనమని, గాడ్సే కన్నా ఘెరమని వ్యాఖ్యానించారు. ఔరంగజేబు లాంటివాడని పేర్కొన్నారు. ప్రతిగా చంద్రబాబు ఎన్టీఆర్ కు విలువలు లేవని కూడా తేల్చారు. చివరకు ఎన్టీఆర్ అడ్రస్ కూడా లేకుండా చేశారు. ఇక అప్పట్లో బాబు సీఎం కాగానే ఎన్టీఆర్ పెద్ద కుమారుడు హరి కృష్ణ కు మంత్రి పదవి ఇచ్చారు. కానీ ఆరు నెలల్లో సాగనంపారు. తన తండ్రికి వెన్నుపోటు లో బావకు సహకరించిన హరికృష్ణ… చంద్రబాబు ఇచ్చిన షాక్ కు నివ్వెర పోయారు.. దీంతో చేసేది ఏమీ లేక సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. అయితే ఇది విఫల ప్రయోగంగా నిలిచిపోయింది.. ఆ తర్వాత కొన్నాళ్లకు చంద్రబాబుతో రాజీ పడ్డారు.. రాజ్యసభ సభ్యత్వం పొందారు. ఈసారి చంద్రబాబు మరింత కఠినంగా ఆట ఆడారు. హరికృష్ణ ఆ పదవిని కోల్పోయారు.ఇక 2009 ఎన్నికల్లో మామ చంద్రబాబుపై అపరిమితమైన ప్రేమాభిమానం తో జూనియర్ ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు.. తన స్థాయికి మించి ఇందిరా గాంధీ ని కూడా ఆ ఎన్నికల ప్రచారంలో విమర్శించారు.. తన వయసుకు మించిన మాటలు మాట్లాడారు. ఇలా ప్రచారం చేస్తూనే ఒకరోజు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ ఎన్నికల్లో టిడిపి చిత్తయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ ను చంద్రబాబు దూరం పెట్టారు.
ఇక కొద్దిరోజులుగా తారకరత్న చంద్రబాబు, లోకేష్ తరపున తిరుగుతున్నారు.. పచ్చ చొక్కా వేసుకొని టిడిపి కార్యక్రమాలకు హాజరవుతున్నారు. గత ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ తరఫున ప్రచారం కూడా చేశారు. చేతిలో సినిమాలు లేని తారకరత్న చంద్రబాబు, లోకేష్ సేవలో తరిస్తూ వస్తున్నారు.. సరిగ్గా కుప్పంలో లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఆ కార్యక్రమంలో పాల్గొన్న తారకరత్న అక్కడే గుండెపోటుకు గురై ఆస్పత్రి పాలయ్యారు. నారా కుటుంబానికి అతిగా ప్రాధాన్యం ఇచ్చినప్పుడల్లా నందమూరి కుటుంబీకులకు ఏదో ఒక ప్రమాదం జరగడం నిజంగా విషాదకరం.