Aryan Khan Bail: ఎట్టకేలకు షారుఖ్ ఖాన్ కొడుకుకు బెయిల్.. ఎలా వచ్చిందంటే?

Aryan Khan Bail: ఎన్ని నోములు నోచాడో.. ఎన్ని వ్రతాలు చేశాడో కానీ బాలీవుడ్ బాద్ షా నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరింది. గత నెలరోజులుగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి దేశంలోని పెద్ద పెద్ద లాయర్లతో కలిసి కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నా ఎన్సీబీ ఏదో ఒక సాక్ష్యం కారణం చెబుతూ బెయిల్ రాకుండా చేసింది. కానీ ఎట్టకేలకు సాక్ష్యాలు లేకుండా ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారని బలమైన వాదనలు వినిపించిన దిగ్గజ […]

Written By: NARESH, Updated On : October 28, 2021 5:31 pm
Follow us on

Aryan Khan Bail: ఎన్ని నోములు నోచాడో.. ఎన్ని వ్రతాలు చేశాడో కానీ బాలీవుడ్ బాద్ షా నిరీక్షణ ఎట్టకేలకు నెరవేరింది. గత నెలరోజులుగా ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయినప్పటి నుంచి దేశంలోని పెద్ద పెద్ద లాయర్లతో కలిసి కోర్టుల్లో వాదనలు వినిపిస్తున్నా ఎన్సీబీ ఏదో ఒక సాక్ష్యం కారణం చెబుతూ బెయిల్ రాకుండా చేసింది. కానీ ఎట్టకేలకు సాక్ష్యాలు లేకుండా ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారని బలమైన వాదనలు వినిపించిన దిగ్గజ లాయర్ ముకుల్ రోహత్గీ ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇప్పించాడు.

Shah Rukh Khan Son Aryan Khan Among 8 Detained by NCB From Cruise Ship

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. డ్రగ్స్ కేసులో చిక్కుకున్న ఆర్యన్ ఖాన్ కు ఊరట లభించింది. గతంలో రెండు సార్లు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా కింది కోర్టులు తిరస్కరించాయి. ఇప్పుడు ఎట్టకేలకు ఆర్యన్ కు బెయిల్ లభించడంతో షారుఖ్ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.

షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ ను డ్రగ్స్ కేసులో ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అతడు డ్రగ్స్ తీసుకుంటాడని.. సంబంధాలున్నాయని ఆరోపించింది. ఈ క్రమంలోనే కొద్దిరోజులుగా ముంబైలోని అర్థర్ రోడ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఆర్యన్ ఉంటున్నాడు. డ్రగ్స్ కేసులో అతడికి బెయిల్ దొరకలేదు. దీంతో జైలు జీవితం గడుపుతున్నాడు.

ఆర్యన్ ఖాన్ కు బెయిల్ రాకుండా ఎన్సీబీ గట్టిగా వ్యతిరేకించింది. అయితే ఆర్యన్ తరుఫున సీనియర్ సుప్రీంకోర్టు లాయర్ ముకుల్ రోహత్గీ రంగంలోకి దిగి వాదించారు. పలు కీలక అంశాలను ప్రస్తావించారు. కుట్రపూరితంగానే ఆర్యన్ ను ఎన్సీబీ అధికారులు ఈ కేసులో ఇరికించారని వాదించారు. ఆర్యన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదని.. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా వైద్య పరీక్షల ఆధారాలేవీ లేవని కోర్టుకు తెలిపారు. మరి అలాంటప్పుడు ఆర్యన్ ఏ విధంగా సాక్ష్యాధారాలను ప్రభావితం చేస్తారని వాదించారు.

సుప్రీంకోర్టు లాయర్ ముకుల్ రోహత్గీ బలమైన వాదనలు వినిపించారు. ఆర్యన్ వద్ద డ్రగ్స్ దొరకలేదని.. అతడితోపాటు కలిసి వచ్చిన ఓ వ్యక్తి వద్ద కేవలం 6 గ్రాముల డ్రగ్స్ దొరికితే ఆర్యన్ ను ఎలా అరెస్ట్ చేస్తారని వాదించారు. 20 రోజులకు పైగా ఎలా జైలులో ఉంచుతారని ముకుల్ రోహత్గీ బలమైన వాదనలు వినిపించారు. అతడి వయసు చాలా చిన్నదని.. వయసు దృష్టిలో ఉంచుకొని ఆర్యన్ కు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టును కోరారు.

వాదనలు విన్న ముంబై హైకోర్టు ఆర్యన్ తోపాటు సహ నిందితులుగా ఉన్న ఆర్భాజ్, మూన్ మూన్ లకు బెయిల్ మంజూరు చేసింది. కాగా ఆర్యన్ బెయిల్ ఆర్డర్ రేపు వచ్చే అవకాశం ఉంది. అతడు రేపు లేదా? ఎల్లుండి ముంబై ఆర్థర్ రోడ్డు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.