Homeఎంటర్టైన్మెంట్Nargis Fakhri's sister : బాలీవుడ్ నటిమణి నర్గీస్ ఫక్రీ సోదరి అరెస్ట్ వెనుక అసలు...

Nargis Fakhri’s sister : బాలీవుడ్ నటిమణి నర్గీస్ ఫక్రీ సోదరి అరెస్ట్ వెనుక అసలు ఏం జరిగిందంటే?

Nargis Fakhri’s sister : నర్గీస్ ఫక్రీ కి సోదరి అలియా ఫక్రి ఉంది. అలియా చాలా సంవత్సరాలనుంచి అమెరికాలోనే ఉంటున్నది. ఈమెకు గతంలో ఎడ్వర్డ్స్ జాకబ్స్ అనే అమెరికా దేశయుడితో సంబంధం ఉండేది. చాలా సంవత్సరాల పాటు వారిద్దరూ సహజీవనం చేశారు. అయితే ఇటీవల విడిపోయారు. అప్పటినుంచి అతనిపై ఆ
అలియా ఆగ్రహంతో ఉందని అమెరికా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గత నెల 23న అమెరికాలోని క్వీన్స్ లో ఓ గ్యారేజీకి అలియా ఉద్దేశపూర్వకంగా నిప్పంటించిందని.. ఆ మంటల్లో ఆమె మాజీ ప్రియుడు ఎడ్వర్డ్స్ జాకబ్స్ (35), అతడి స్నేహితుడు అనస్తాసియా ఎట్టియోన్ (33) దుర్మరణం చెందారు. దీనిపై అలియా అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ” క్వీన్స్ లో జరిగిన ఈ ఘటనలో ఎడ్వర్డ్ జాబ్స్, ఎట్టియోన్ కన్నుమూశారు. ఈ ఘటనకు సంబంధించి మా వద్ద బలమైన సాక్ష్యాలు ఉన్నాయని” న్యాయవాదులు చెబుతున్నారు. అయితే ఇటీవల జాకబ్స్, అలియా విడిపోయారు. తనతో కలిసి ఉండాలని అలియా అతడిని పదేపదే ప్రాధేయపడింది. అయినప్పటికీ జాకబ్స్ వినిపించుకోలేదు. అతడి మనసు కరిగించడానికి అలియా ఎన్నో ప్రయత్నాలు చేసింది. అయితే వాటన్నింటినీ అతడు తిరస్కరించాడు. దీంతో గత్యంతరం లేక అతడిని అంతమొందించాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో అతడు ఉంటున్న గ్యారేజ్ కి నిప్పంటించింది. అయితే అదే సమయంలో జాకబ్స్ స్నేహితుడు ఉండడంతో.. అతడు కూడా చనిపోయాడు.

అలియా పై కేసుల నమోదు

జాకబ్స్, అతడి స్నేహితుడి మరణానికి కారణమైన అలియా పై అమెరికా పోలీసులు కేసులు నమోదు చేశారు. క్వీన్స్ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయం ఆమెను డిసెంబర్ 9న కోర్టు విచారిస్తుందని ప్రకటించింది. నవంబర్ 23న ఉదయం ఆరు గంటల 20 నిమిషాలకు గ్యారేజీకి అలియా నిప్పంటించింది. దానికంటే ముందు ” ఈరోజు మీరంతా చనిపోతారు” అని బిగ్గర గా అరిచిందని అమెరికా మీడియా చెబుతోంది. అయితే అలియా ఎదుర్కొంటున్న అభియోగాలపై ఆమె తల్లి స్పందించింది. ” ఆమె అలాంటిది కాదు. అందరిపై విపరీతమైన శ్రద్ధ వహిస్తుంది. అలాంటి మహిళ ఇలాంటి ఘారతుకానికి పాల్పడిందని నేను అనుకోనని” ఆమె వ్యాఖ్యానించింది. ఈ నేరంపై న్యూయార్క్ డైరీ న్యూస్ ప్రతినిధి ఆమెను సంప్రదించగా పై విధంగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం అలియా న్యూయార్క్ నగరంలోని అతిపెద్ద జైలైన రికర్స్ లో విచారణ ఖైదీగా ఉంది. ఒకవేళ ఆమె నేరానికి పాల్పడినట్టు రుజువైతే జీవితకాలం ఖైదు పడే అవకాశం ఉంది.

20 ఏళ్లుగా మాటల్లేవ్

బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ సోదరీ అలియా. రాక్ స్టార్ సినిమా ద్వారా నర్గీస్ బాలీవుడ్ కు పరిచయమైంది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నర్గీస్ కు విపరీతంగా అవకాశాలు వచ్చాయి. అయితే అలియా కు నర్గీస్ ఫక్రి కి 20 సంవత్సరాలుగా మాటల్లేవట.. అలియా ఉదంతం వెలుగులోకి రావడంతో.. మీడియా నర్గీస్ ఫక్రిని సంప్రదించగా..”ఆమెకు నాకు మాటలు లేవు. దాదాపు రెండు దశాబ్దాలు గడిచిపోయింది. ఈ విషయంపై నన్ను ఏమీ అడగొద్దని” నర్గీస్ వ్యాఖ్యానిచ్చినట్టు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular