https://oktelugu.com/

BMC Elections 2022: సెలబ్రిటీలకు గాలం వేస్తున్న కాంగ్రెస్?

BMC Elections 2022: వచ్చే ఏడాది జరగబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(BMC Elections) కోసం కాంగ్రెస్ (Congress) వ్యూహాలు ఖరారు చేస్తోంది. సెలబ్రిటీలను తమ పార్టీ కోసం ప్రకటిస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టేందుకు సెలబ్రిటీలను ఎంచుకుంటోంది. యువత మెచ్చే వ్యక్తులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం మహారాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : August 24, 2021 / 01:09 PM IST
    Follow us on

    BMC Elections 2022: వచ్చే ఏడాది జరగబోయే బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల(BMC Elections) కోసం కాంగ్రెస్ (Congress) వ్యూహాలు ఖరారు చేస్తోంది. సెలబ్రిటీలను తమ పార్టీ కోసం ప్రకటిస్తున్నారు. మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం నిలబెట్టేందుకు సెలబ్రిటీలను ఎంచుకుంటోంది. యువత మెచ్చే వ్యక్తులను మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తోంది. కాంగ్రెస్ నిర్ణయం మహారాష్ర్ట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తున్నట్లు తెలుస్లోంది. ఏది ఏమైనా పార్టీలసమీకరణలు మారే సూచనలు కనిపిస్తున్నాయి.

    సినీనటులు రితేశ్ దేశ్ ముఖ్, సోనూసూద్, మిలింద్ సోమన్ పేర్లు కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ రూపొందించిన స్రాటజీ డాక్యుమెంట్ లో ఈమేరకు ప్రస్తావించారు. కొద్ది రోజుల్లో మహారాష్ర్ట ఏఐసీసీ సెక్రటరీ ఇన్ చార్జి హెచ్ కే పాటిల్ ఈ డ్రాఫ్ట్ ను సమర్పిస్తారని చెబుతున్నారు మేయర్ అభ్యర్థిని ముందుగానే ప్రకటించడంతో పార్టీ విధానాలు ప్రజలకు చేరతాయని సూచించారు. రాజకీయ నేపథ్యం లేని వ్యక్తిని నియమించడంపై ప్రధానంగా చర్చించార. యువతలో ఆదరణ ఉన్న వ్యక్తిని ప్రకటించి తద్వారా లబ్ధి పొందాలను చూస్తోంది. ఈ ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేయడమా లేక ఒంటరిగానా అనేది తేలాల్సి ఉంది.

    ముంబైలో దశాబ్దాలుగా శివసేన పార్టీయే విజయం సాధిస్తూ వస్తోంది. 1997 నుంచి 2012 వరకు బీజేపీతో శివసేన గెలిచింది. 2017లో ఒంటరిగానే పోటీ చేసి మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంది. మారిన రాజకీయ పరిస్థితుల్లో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి బీఎంసీలో పోటీ చేస్తుందా? లేదా అని వేచి చూస్తున్నారు. తాజాగా ముంబై కాంగ్రెస్ సిద్ధం చేసిన స్రాటజీ డ్రాఫ్ట్ లో ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

    బీఎంసీ ఎన్నికలకు సిద్ధం కావాలని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుుతన్నాయి. తాజాగా ముంబై కాంగ్రెస్ సిద్ధం కావాలని నేతలు పిలుపునిస్తున్నారు. పార్టీ ఒంటరిగానే పోటీ చేయాలని బావిస్తున్నట్లు పార్టీనేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు లేని చోట త్వరగా గుర్తించాలని సూచిస్తున్నారు. సంచిత్ బహుజన్ అఘాడి, ఎంఐఎం పార్టీలను బీజేపీ బీ టీమ్ గా ప్రచారం చేయాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయాలని అన్ని దారుల వెతుతుకున్నట్లు సమాచారం.